వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హీరో కమల్ హాసన్ కు హిందూ సంఘాలు వార్నింగ్: ముస్లీంల రుచి చూశావు, మాతోపెట్టుకుంటే !

కమల్ హాసన్ కు హిందూ సంఘాల వార్నింగ్ఇప్పటకే ముస్లీంల రుచి చూశావు, మాదెబ్బ ఎలా ఉంటోందో చూపిస్తాంకమల్ పెద్ద అవినీతి పరుడు,ఎన్ఐఏ కమల్ హాసన్ ను విచారణ చెయ్యాలి, బీజేపీ

|
Google Oneindia TeluguNews

చెన్నై: బహుబాష నటుడు, దర్శకుడు కమల్ హాసన్ హిందూ ఉగ్రవాదం ఉందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చెయ్యడంతో హిందూ సంఘ, సంస్థలు మండిపడుతున్నాయి. వెంటనే కమల్ హాసన్ హిందూవులకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని, లేదంటే పరిస్థితులు వేరుగా ఉంటాయని హెచ్చరించారు.

తమిళనాడుకు చెందిన హిందూ మక్కల్ కచ్చి పార్టీ అధ్యక్షుడు అర్జున్ సంపత్ గురువారం చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ కమల్ హాసన్ వెంటనే ఆయన చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని బహిరంగంగా హిందూవులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

Hindu grops warn actor Kamal Haasan, ask apology

విశ్వరూపం సినిమా విడుదల సమయంలో ముస్లీంలు నిరసన వ్యక్తం చేసినప్పుడు వారి దెబ్బ ఎలా ఉంటుందో కమల్ హాసన్ రుచి చూరని, ఇప్పుడు హిందూవులకు క్షమాపణలు చెప్పకపోతే మారుచి ఎలా ఉంటుందో చూపిస్తామని హిందూ మక్కల్ కట్చి పార్టీ వ్యవస్థాపకుడు అర్జున్ సంపత్ హెచ్చరించారు. హిందూవులకు క్షమాపణ చెప్పకపోతే కమల్ హాసన్ వెంటనే తమిళనాడు విడిచిపెట్టి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు.

దశవతారం సినిమాలో కమల్ హాసన్ 10 పాత్రలు పోషించారని, ఇప్పుడు 11వ అవతారం పోషిస్తున్నారని అర్జున్ సంపత్ ఎద్దేవ చేశారు. బహిరంగంగా హిందూవులకు క్షమాపణలు చెప్పకపోతే త్వరలోనే కమల్ హాసన్ కు బుద్దిచెబుతామని అర్జున్ సంపత్ హెచ్చరించారు.

బీజేపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యస్వామి కమల్ హాసన్ వ్యాఖ్యలపై స్పంధింస్తూ అతను ఒక పెద్ద అవినీతిపరుడు అంటూ తీవ్రస్థాయిలో విమర్శించారు. ఎన్ఐఏ అధికారులు వెంటనే కమల్ హాసన్ ను విచారణ చేసి హిందూ ఉగ్రవాదం ఎక్కడ ఉందో సమాచారం, సాక్షాలు ఇవ్వాలని ప్రశ్నించాలని సుబ్రమణ్యస్వామి డిమాండ్ చేశారు.

English summary
Annoyed at Kamal Haasan's remark that 'Hindu extremism is alive and kicking in Tamil Nadu, Hindu groups have urged the actor-filmmaker to take back his words and seek an apology to Hindus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X