వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'ఇంటికెళ్లి.. మగతనానికి పూజలు చేయండి..' : తొగాడియా వివాదస్పద కామెంట్స్

|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్ : విశ్వ హిందూ పరిషత్ నేత ప్రవీణ్ తొగాడియా మరోసారి వివాదస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకి ఎక్కారు. హిందూ పురుషులు లైంగిక సామర్థ్యం గురించి ఆందోళన చెందుతూ ఆయన చేసిన తాజా కామెంట్స్ అందరి నోటా హాట్ టాపిక్ గా మారాయి.

గుజరాత్ లోని జంబూసార్‌లో శుక్రవారం నాడు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి హాజరైన తొగాడియా, హిందువులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. హిందూ పురుషుల్లో లైంగిక సామర్థ్యం క్షీణిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయం తనను ఆవేదనకు గురి చేస్తోందని చెప్పిన ఆయన దీనికి ఓ పరిష్కార మార్గాన్ని కూడా సూచించారు.

అయితే పరిష్కారం పేరిట తొగాడియా చేసిన ఆ వ్యాఖ్యలే ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. హిందూ పురుషుల్లో లైంగిక సామర్థ్యం పెరగడానికి సలహా ఇస్తూ.. 'ఇంటికెళ్లండి.. మగతనానికి పూజలు నిర్వహించండి..' అని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.

Hindu men, go home and worship your manhood: VHP leader Pravin Togadia

ఇంకా ఆయన మాట్లాడుతూ.. రోజురోజుకి పెరిగిపోతున్న ముస్లిం జనాభాకి సమానంగా హిందు జనాభా కూడా పెరగాల్సి ఉన్నా..! హిందూ పురుషుల్లో తగ్గిపోతున్న లైంగిక సామర్థ్యం కారణంగా పిల్లల జననాలు కూడా తగ్గిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనంతటికి కారణం మధ్యపానమే అని చెప్పిన తొగాడియా, మధ్యపానానికి పూర్తిగా దూరమవ్వాలని చెప్పారు.

ఇక అన్నింటికంటే ముఖ్యంగా.. లైంగిక సామర్థ్య పెరుగుదల కోసం తానే స్వయంగా ఓ మందును తయారు చేశానని చెప్పుకొచ్చిన తొగాడియా, రూ.600 విలువ చేసే ఆ మందును రూ.500 లకే అందజేస్తున్నానని అన్నారు. తాను ఇస్తున్న ఆ మందును తీసుకెళ్లి ఇంటికి వెళ్లాక భార్యలకు ఇవ్వాలని, అన్నం తినేటప్పుడు అందులో ఆ మందును కలుపుకుని భోజనం చేస్తే.. లైంగిక సామర్థ్యం పెరిగి సంతానోత్పత్తి పెరుగుతుందని చెప్పుకొచ్చారు.

English summary
Blaming growing “impotency” among Hindu men for the decline in share of the community in the country’s population, VHP leader Pravin Togadia Friday exhorted them to “go home and worship your manhood”.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X