వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పూజలు: ప్రాణాలకు తెగించి రైలు మీద (వీడియో)

|
Google Oneindia TeluguNews

చిత్రకోట్: పితృపక్షాల సందర్బంగా ప్రత్యేక పూజలు చెయ్యడానికి హిందువులు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఉత్తరప్రదేశ్ లోని రైళ్లు కిక్కిరిసిపోయాయి. మహిళలు, పిల్లలు, వృద్దులు సైతం వారి ప్రాణాలను లెక్క చెయ్యలేదు. రైలు బోగీల మీద కూర్చుని, కిటికీలు పట్టుకుని ప్రయాణించారు.

ఉత్తరప్రదేశ్ లో నవరాత్రి ఉత్సవాల సందర్బంగా పితృపక్షాల 16వ రోజున హిందువులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. చిత్రకోట్ లో అందుకు అవసరమైన అన్ని ఎర్పాట్లు పెద్ద ఎత్తున చేస్తారు. పితృపక్షాల 16వ రోజున చంద్రుడిని చూసి మరణించిన పెద్దలకు పూజలు చేస్తే వారి ఆత్మశాంతిస్తుందని హిందువుల నమ్మకం.

హొలి నగరం నుంచి చిత్రకోట్ కు రైలులో ప్రయాణించడానికి వేలాది మంది తరలి రావడంతో రైల్వే అధికారులు హడలిపోయారు. అన్ని బోగీలు నిండిపోవడంతో ప్రయాణికులు బోగీల మీద ఎక్కి కూర్చున్నారు. అంతే కాకుండ వేలాది మంది బోగీల కిటికీలు పట్టుకుని ప్రయాణం చెయ్యడానికి సిద్దం అయ్యారు.

రైల్వే అధికారులు, సిబ్బంది ఎంత చెప్పినా ప్రయాణికులు పట్టించుకోలేదు. తాము అనుకున్న రోజు ప్రత్యేక పూజలు చెయ్యాలని, అందుకు ఎంత రిస్క్ అయినా చేస్తామని తేల్చి చెప్పారు. రైలు చాల సేపు నిలిపివేసిన అధికారులు చివరికి చిత్ర కోట్ కు రైలు సర్వీసు నడిపారు. 50, 000 మంది ప్రయాణికులు ఈ రైలులో వెళ్లారని అధికారులు అంచనా వేశారు.

English summary
In a desperate attempt, thousands of stranded Hindu pilgrims attending a special fair risked their lives by travelling on rooftop of trains and hanging from the sides of the coaches in the holy town of Chitrakoot in Uttar Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X