వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పౌరసత్వ బిల్లు అమోదంతో .... సంబరాలు చేసుకున్న పాకిస్తాన్ శరణార్థులు...

|
Google Oneindia TeluguNews

లోక్‌సభలో అమోదింపబడ్డ పౌరసత్వ బిల్లును కొన్ని వర్గాలు వ్యతిరేకిస్తుండగా ఇంకోందరు స్వాగతిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే లోక్‌సభలో ప్రవేశపెట్టిన బిల్లు పాస్‌కావడంతో పాకిస్థాన్ నుండి వలస వచ్చిన హిందూ శరణార్థులు సంబరాలు జరుపుకున్నారు. ఈ బిల్లు రాజ్యసభలో కూడ పాస్ కావాలంటూ వారు కోరుకున్నారు. ఢిల్లీలోని నివసిస్తున్న పాకిస్తాన్ హిందూ శరణార్థి కుటుంబాలు స్వీట్లు పంచుకుని తమ అనందాన్ని వ్యక్తం చేశారు.

లోక్‌సభలో ప్రవేశపెట్టిన పౌరసత్వ చట్ట సవరణ బిల్లులో భాగంగా పలు కొత్త నిబంధనలు ,చట్టాల్లో మార్పులను తీసుకువచ్చారు. ఇందులో ఇతర దేశాల నుండి వచ్చి భారత్‌లో స్థిరపడ్డ హిందూ శరణార్థులకు కూడ భారత పౌరసత్వం ఇవ్వనున్నారు. దీంతో పాకిస్థాన్ నుండి శరణార్థులకు వారికి భారత పౌరసత్వం లభించనుంది. దీంతో ఇతర దేశాల నుండి వచ్చిన హిందువులకు సైతం పౌరసత్వాన్ని కల్పించనున్నారు. ఈనేపథ్యంలోనే వారు సంబురాలను చేసుకున్నారు. అన్నింటినీ వదిలిపెట్టి..పాకిస్తాన్‌ నుంచి భారత్‌కు వచ్చామని. తమలాంటి వారికి అన్ని రాజకీయ పార్టీల మద్దతు కావాలని శరణార్థులంతా ముక్త కంఠంతో తెలిపారు. రాజ్యసభలో కూడా ఈ బిల్లు ఆమోదం పొంది చట్టం రూపం దాల్చాలని వారు కోరుకున్నారు.

Hindu refugees from pakistan celebrated by Citizenship bill

త్వరలో తమకు మంచిరోజులు రాబోతున్నాయన్నంటూ...అన్నింటినీ వదిలిపెట్టి..పాకిస్తాన్‌ నుంచి భారత్‌కు వచ్చామని. తమలాంటి వారికి అన్ని రాజకీయ పార్టీల మద్దతు కావాలని శరణార్థులంతా ముక్త కంఠంతో తెలిపారు. రాజ్యసభలో కూడా ఈ బిల్లు ఆమోదం పొంది చట్టం రూపం దాల్చాలని వారు కోరుకున్నారు. కాగా బిల్లుపై ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే...

English summary
Hindu refugees from pakistan who living in delhi celebrated the passage of Citizenship bill in lok sabha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X