వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హిందుస్తాన్ హిందువులదే: ఆర్ఎస్సెస్ ఛీఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు

రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌(ఆర్ఎస్సెస్) చీఫ్‌ మోహన్‌ భగవత్‌ మరోసారి తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందుస్తాన్‌ (భారత్‌) కేవలం హిందువుల కోసమేనని అయన స్పష్టం చేశారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

ఇండోర్‌ : రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌(ఆర్ఎస్సెస్) చీఫ్‌ మోహన్‌ భగవత్‌ మరోసారి తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందుస్తాన్‌ (భారత్‌) కేవలం హిందువుల కోసమేనని అయన స్పష్టం చేశారు.

ఇండోర్‌లో శనివారం జరిగిన రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ కార్యకర్తల సమావేశంలో ప్రసంగింస్తూ.. ఇలా వ్యాఖ్యానించారు. అయితే హిందుస్తాన్‌లో ఇతర మతస్తులు కూడా జీవించవచ్చని చెప్పారు.

జర్మన్ల కోసం జర్మనీ, బ్రిటీషర్ల కోసం బ్రిటన్‌, అమెరికన్ల కోసం అమెరికా.. అలాగే హిందువుల కోసం హిందుస్తాన్‌ అని మోహన్‌ భగవత్‌ స్పష్టం చేశారు. ఇక్కడ హిందువులు అంటే.. భారతమాత బిడ్డలని ఆయన విశ్లేషించారు.

 Hindustan is a country of Hindus but it belongs to others too: RSS chief Mohan Bhagwat

పురాతన భారతీయ వారసత్వ సంపద, సంస్కృతి, సంప్రదాయాలను కొనసాగించే వారసులంతా భారతీయులే. అందులో సందేహపడాల్సిన అవసరం లేదని మోహన్‌ భగవత్‌ చెప్పారు.

భారతదేశాన్ని ఏ ఒక్క పార్టీనో, లేక ఏ ఒక్క వ్యక్తో అభివృద్ధి చేయడం అసాధ్యమని.. సమాజం కూడా తనవంతు పాత్ర పోషిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన అన్నారు. కేవలం ప్రభుత్వం వల్లే సమాజంలో మార్పు, అభివృద్ధి జరగదని.. మార్పు, అభివృద్ధి కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని అయన పిలుపునిచ్చారు.

English summary
Hindustan is a country of Hindus, but it does not mean that it does not belong to others, according to Rashtriya Swayamsevak Sangh chief Mohan Bhagwat. Addressing a gathering of college-going RSS volunteers in Indore on Friday, he said the government alone cannot bring development, and that it needed changes in society. “Whose country is Germany?... It is a country of Germans, Britain is a country of Britishers, America is a country of Americans, and in the same way Hindustan is a country of Hindus. It does not mean that Hindustan is not the country of other people,” he said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X