వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్ అమెరికా టూ భారత్, టాటా కోసం, 69 లక్షల ఉద్యోగాలు వచ్చాయి, నోటిఫికేషన్ జారీ, ఓ పనైపోయింది !

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తన భారత్ పర్యటన సందర్బంగా 6 నుంచి 10 మిలియన్ ల (60 లక్షల నుంచి ఒక కోటి మంది) ప్రజలు పాల్గోంటారని ఆ దేశ ప్రధాని నరేంద్ర మోదీ తనతో చెప్పారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే చెప్పారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను ముందు పెట్టుకున్న ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఆ పార్టీ మిత్రపక్షాలు (ఎన్డీఏ)ను ఇరుకున పెట్టడానికి విఫలయత్నం చేస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన సందర్బంగా ప్రధాని నరేంద్ర మోదీ 69 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారని, ఇప్పటికే లక్ష ఉద్యోగాలు ఇచ్చేశారని కాంగ్రెస్ పార్డీ బీజేపీకి చురకలు అంటిస్తూ ఉద్యోగాల ప్రకటన విడుదల చేసింది.

టిక్ టాక్ లేడీ ఫేం రచ్చ, బహిష్కరించండి, ఆర్మీ భర్త మృతి, అడిగేవాళ్లు లేరని అసభ్యంగా, బూతులు, కేసు !టిక్ టాక్ లేడీ ఫేం రచ్చ, బహిష్కరించండి, ఆర్మీ భర్త మృతి, అడిగేవాళ్లు లేరని అసభ్యంగా, బూతులు, కేసు !

2 కోట్ల ఉద్యోగ అవకాశాలు

2 కోట్ల ఉద్యోగ అవకాశాలు

తాము అధికారంలోకి వస్తే కచ్చితంగా 2 కోట్ల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని లోక్ సభ ఎన్నికల ప్రచారం ముందు ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు హామీ ఇచ్చారని కాంగ్రెస్ అంటోంది. లోక్ సభ ఎన్నికల ముందు ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఏం చెప్పారు ? అనే విషయం మీకు గుర్తుందా ? అంటూ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆ విషయాన్ని తెర మీదకు తెచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన సందర్బంగా కాంగ్రెస్ పార్టీ ప్రధాని నరేంద్ర మోదీని ఇరుకున పెట్టడానికి ప్రయత్నించింది.

69 లక్షల ఉద్యోగాలకు ప్రకటన

69 లక్షల ఉద్యోగాలకు ప్రకటన

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం అహమ్మదాబాద్ చేరుకుంటున్న సందర్బంగా 22 కిలోమీటర్ల రోడ్ షో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. అహమ్మదాబాద్ లోని కొత్తగా నిర్మించిన మొతారా క్రికెట్ స్టేడియంలో ‘నమస్తే ట్రంప్' అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల్గొంటున్నారు. ట్రంప్ పర్యటన సందర్బంగా ఏర్పాటు చేసిన ‘నమస్తే ట్రంప్'కార్యక్రమం సందర్బంగా 69 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది.

బీజేపీ లీడర్స్ కు కౌంటర్

బీజేపీ లీడర్స్ కు కౌంటర్

నమస్తే ట్రంప్ కార్యక్రమంలో కొన్ని లక్షల మంది పాల్గొంటారని ఇప్పటికే బీజేపీ నాయకులు ప్రకటించారు. 22 కిలో మీటర్ల రోడ్ షో సందర్బంగా. మొతారా క్రికెట్ స్టేడియంలో జరిగే కార్యక్రమం సందర్బంగా 69 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు చిక్కాయని, వెంటనే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యంగంగా ఓ ప్రకటన విడుదల చేశారు.

ఇక్కడే ఉద్యోగాలు

ఇక్కడే ఉద్యోగాలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటన సందర్బంగా 69 లక్షల మందికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పించిందని కాంగ్రెస్ విమర్శలు చేస్తుంది. అహమ్మదాబాద్ లోని మొతారా స్టేడియంలో ఫిబ్రవరి 24వ తేదీ సోమవారం మద్యాహ్నం 12 గంటల నుంచి మీరు ఉద్యోగాలు చెయ్యడానికి సిద్దంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ విచిత్రంగా, వ్యంగంగా ఓ ప్రకటన విడుదల చేసింది. లోక్ సభ ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వాగ్దానాలు నేరవేర్చడం సాధ్యం అవుతుందా ?, ఆ హామీలు నెరవేర్చి ప్రజకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా ? అంటూ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది.

మోదీ జుమ్లా ట్రాక్టర్

మోదీ జుమ్లా ట్రాక్టర్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన సందర్బంగా ప్రధాని నరేంద్ర మోదీ నానా హడావిడి చేస్తున్నారని, రాజకీయంగా లాభం పొందడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేసింది. ఈ సందర్బంగా ప్రధాని నరేంద్ర మోదీ లోక్ సభ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ముందు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రధాని నరేంద్ర మోదీ మీద దుమ్మెత్తిపోస్తోంది.

2 కోట్ల ఉద్యోగాలు, ఒక్కరికి రూ. 15 లక్షలు

2 కోట్ల ఉద్యోగాలు, ఒక్కరికి రూ. 15 లక్షలు

ప్రధాని నరేంద్ర మోదీ 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారని, ప్రతి ఒక్కరి బ్యాంకు అకౌంట్ లో రూ. 15 లక్షలు డిపాజిట్ చేస్తామని, 100 స్మార్ట్ సిటీలు నిర్మిస్తామని, అచ్చే దిన్ (మంచి రోజులు) వస్తాయని ఉచిత హామీలు ఇచ్చారని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. లోక్ సభ ఎన్నికలకు ముందు ప్రధాని మోదీ ఇచ్చిన హామీలు ఈ రోజు కొన్ని నెరవేర్చుతున్నారని, ట్రంప్ పర్యటన సందర్బంగా 69 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు చిక్కాయని, నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ వ్యంగంగా విమర్శలు చేసింది.

English summary
New DelhiG: Hiring now to wave at US President Donald Trump, 69 Vacancies; Congress jibes at Narendra Modi Government over Donal Trump's visit.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X