వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శివమొగ్గ నుంచి వచ్చినవాళ్లంతా అంతే!: యడ్యూరప్ప విషయంలోనూ అదే రిపీట్..

|
Google Oneindia TeluguNews

Recommended Video

యడ్యూరప్ప రాజీనామా చేయడంతో ఓ ఆసక్తికర కథనం తెర పైకి

బెంగళూరు: బలనిరూపణలో చతికిలపడి.. అంతకన్నా ముందుగానే యడ్యూరప్ప రాజీనామా చేయడంతో ఓ ఆసక్తికర కథనం తెర పైకి వచ్చింది. అదేంటంటే.. ఇప్పటివరకు శివమొగ్గ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రులు అయినవారెవరూ పూర్తి కాలం ఆ పదవిలో కొనసాగలేదు.
యడ్యూరప్ప విషయంలో మూడోసారి అదే ట్రెండ్ రిపీట్ అయిందని పరిశీలకులు గుర్తుచేస్తున్నారు.

 కడిదల్ మంజప్ప

కడిదల్ మంజప్ప

శివమొగ్గ నుంచి ఇప్పటిదాకా నలుగురు వ్యక్తులు సీఎం అయ్యారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కడిదపల్ మంజప్ప ఈ ప్రాంతం నుంచి సీఎంగా ఎన్నికైన తొలి వ్యక్తి. కానీ కేవలం 75రోజులు మాత్రమే ఆయన పదవిలో కొనసాగారు.అగస్టు 19,1956 నుంచి అక్టోబర్ 31 1956వరకు మాత్రమే ఆయన పదవిలో ఉన్నారు.

మంజప్ప తర్వాత నిజలింగప్ప

మంజప్ప తర్వాత నిజలింగప్ప

ఆ తర్వాత ఇదే ప్రాంతం నుంచి కాంగ్రెస్ పార్టీకే చెందిన నిజలింగప్ప రెండుసార్లు సీఎం అయినప్పటికీ ఒక్కసారి కూడా ఆయన పూర్తి కాలం పదవిలో కొనసాగలేకపోయారు. తొలిసారి సీఎం అయినప్పుడు 1956-1958, ఆ తర్వాత 1962-1968మధ్య కాలంలో ఆయన సీఎంగా వ్యవహరించారు.

బంగారప్పదీ అదే పరిస్థితి

బంగారప్పదీ అదే పరిస్థితి

మంజప్ప, నిజలింగప్ప తర్వాత శివమొగ్గ నుంచి ఎస్.బంగారప్ప సీఎం అయ్యారు. కానీ అక్టోబర్ 1990 నుంచి అక్టోబర్ 31 1956వరకు.. అంటే, కేవలం 756రోజులు మాత్రమే ఆయన పదవిలో కొనసాగారు.

అప్పటి సీఎం వీరేంద్ర పాటిల్ ను తప్పించి రాజీవ్ గాంధీ బంగారప్పను సీఎంగా నియమించారు. కానీ రాజీవ్ గాంధీ మరణానంతరం అప్పటి కాంగ్రెస్ చీఫ్ సీతారాం కేసరి బంగారప్పను సీఎం పదవి నుంచి బలవంతంగా తప్పించారు. ఆపై బంగారప్ప సొంత పార్టీ ఏర్పాటు చేసుకున్నారు.

 జేహెచ్ పటేల్:

జేహెచ్ పటేల్:


బంగారప్ప తర్వాత శివమొగ్గ నుంచి జేహెచ్ పటేల్ సీఎం అయ్యారు. ఈయన కూడా పూర్తి కాలం పదవిలో కొనసాగలేదు. మే 31 1996 నుంచి అక్టోబర్ 17 1999వరకు మాత్రమే పటేల్ పదవిలో కొనసాగారు. అప్పటి సీఎం దేవెగౌడ తన పదవికి రాజీనామా చేసి ప్రధానమంత్రి కావడంతో.. పటేల్ సీఎం అయ్యారు.

యడ్యూరప్ప కథ తెలిసిందే..:

యడ్యూరప్ప కథ తెలిసిందే..:

ఇక ఆ తర్వాత శివమొగ్గ నుంచి సీఎం అయింది యడ్యూరప్పనే. మూడుసార్లు సీఎం అయిన యడ్యూరప్ప చివరిసారి కేవలం 55రోజుల పాటు మాత్రమే పదవిలో కొనసాగారు. అంతకుముందు నవంబర్ 12, 2007 నుంచి నవంబర్ 19,2007వరకు.. అంటే 7రోజులుగా మాత్రమే ఆయన సీఎంగా పనిచేశారు. ఆ తర్వాత మే 30 2008 నుంచి నవంబర్ 19 2011 వరకు ఆయన సీఎంగా పనిచేశారు. ఆ సమయంలోనే మైనింగ్ కేసుల్లో ఇరుక్కోవడంతో ఆయన సీఎం పదవికి రాజీనామా చేయక తప్పలేదు.

ఇక తాజా కర్ణాటక ఎన్నికల తర్వాత మే 17న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన యడ్డీ.. ఆ తర్వాత విశ్వాసపరీక్షలో నెగ్గలేక రాజీనామా చేశారు. మొత్తంగా శివమొగ్గ నుంచి సీఎం అయిన ఏ నాయకుడు పూర్తి కాలం పదవిలో లేకపోవడం గమనార్హం.

English summary
There have been four Chief Ministers that Shivamogga has produced. Ironically none of them have completed their term. This has been a trend with CM candidates from Shivamogga, the home town of B S Yeddyurappa since 1956.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X