వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సల్మాన్ హిట్ అండ్ రన్ కేసు: 'డ్రైవింగ్ లైసెన్స్ చూపించమని సల్మాన్‌కు అదేశించలేం'

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

ముంబై: 2002 హిట్ అండ్ రన్ కేసులో ఆరోపణలను ఎదుర్కొంటున్న సల్మాన్ ఖాన్‌కు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే చూపించమని తాము ఆదేశించలేమని సెషన్స్ కోర్టు మంగళవారం స్పష్టం చేసింది. ఈ మేరకు ఆదేశాలివ్వాలంటూ వేసిన వ్యాజ్యాన్ని కొట్టివేసింది.

ఈ కేసులో వాదనలు గత నెల 27నే పూర్తయ్యాయని, ఇరువురి వాదనలు విన్నామని మంగళవారం తీర్పును వెలువరించాల్సి ఉన్నందున ఈ సమయంలో ఇక ఎలాంటి ఆదేశాలివ్వబోమని స్పష్టం చేసింది.

Hit-and-run case: Court says it can't ask Salman Khan to produce driving licence

హిట్ అండ్ రన్ కేసు 2002లో నమోదైందని ఆ సమయంలో సల్మాన్ ఖాన్‌కు డ్రైవింగ్ లైసెన్స్ లేదని, ఆయనకు లైసెన్స్ వచ్చిందే 2004లో అని ఆర్టీఏ రికార్డులో ఉందని ప్రదీప్ ఘారత్ అనే పబ్లిక్ ప్రాసిక్యూటర్ తాను వేసిన వ్యాజ్యంలో పేర్కొన్నారు.

ఒకవేళ ఆ సమయంలో ఆయనకు లైసెన్స్ ఉందని నిరూపించుకోవాలనుకుంటే దానిని కోర్టుకు సమర్పించాల్సిందిగా ఆదేశించాలని కోరారు. దీనిపై మంగళవారం ముంబై సెషన్స్ కోర్టు మంగళవారం తీర్పును వెలువరించాల్సి ఉంది.

సెప్టెంబర్ 28, 2002న సల్మాన్ ఖాన్ కారు బాంద్రా సబర్బన్‌లో కాలినడకన వంతెనపై నిద్రిస్తున్న వారిపై నుంచి, బేకరీలోకి దూసుకుపోయిందని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ఘటనలో ఒకరు చనిపోగా, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ కేసు 2002 నుంచి ట్విస్టుల మీద ట్విస్టులతో పొడిగించబడుతూనే ఉంది.

English summary
A sessions court today rejected an application filed by the prosecution in the 2002 hit-and-run case involving actor Salman Khan as it ruled that an accused cannot be forced to produce any document at the fag end of the trial.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X