వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హిట్ అండ్‌ రన్ కేసు: సల్మాన్‌కు సుప్రీం నోటీసులు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్‌ఖాన్‌కు శుక్రవారం సుప్రీంకోర్టు నోటీసులు పంపించింది. 2002 హిట్‌ అండ్‌ రన్‌ కేసులో బాంబే హైకోర్టు సల్మాన్‌ను నిర్దోషిగా విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

ఈ నేపథ్యంలో కోర్టు సల్మాన్‌కు నోటీసులు పంపింది. కాగా, 2002లో ముంబైలో సల్మాన్‌ కారు ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిపైకి దూసుకెళ్లడంతో ఒకరు మరణించారు. నలుగురికి గాయాలయ్యాయి.

Hit-and-run case: SC issues notice to Salman Khan

సుదీర్ఘ కాలం సాగిన ఈ కేసు విచారణలో కింది కోర్టు సల్మాన్‌ను దోషిగా నిర్ధారించినప్పటికీ హైకోర్టు నిర్దోషిగా తీర్పు ఇచ్చింది. దీంతో 2002లో హిట్‌ అండ్‌ రన్‌ కేసులో సల్మాన్‌ ఇటీవల నిర్దోషిగా విడుదలయ్యారు.

కాగా, సల్మాన్ ఖాన్‌ను దోషిగా అనడానికి ఎలాంటి ఆధారాలు లేవని సల్మాన్ తరపు న్యాయవాది కపిల్ సిబాల్ చెప్పారు. ప్రమాదం జరిగిన సమయంలో కారు డ్రైవర్ సీటులో సల్మాన్ ఖాన్ కూర్చుని ఉన్నారని పలువురు ప్రత్యక్షసాక్షులు చెప్పారని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి తెలిపారు.

English summary
The Supreme court on Friday issued notice to filmstar Salman Khan on the Maharashtra government's petition challenging a Bombay high court verdict acquitting him in a 2002 hit-and-run case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X