వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమిత్‌షా ఆరోగ్యానికి ఏమైంది? మళ్లీ ఎయిమ్స్‌లో చేరిన కేంద్ర హోం మంత్రి: రెండువారాల్లోనేఅమిత్‌షా ఆరోగ్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. మరోసారి అనారోగ్యానికి గురయ్యారు. శ్వాసకోశ సంబంధ సమస్యలకు గురయ్యారు. శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బందులు ఎదురు కావడంతో ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.శనివారం రాత్రి 11 గంటల సమయంలో దేశ రాజధానిలోని అఖిల భారత వైద్య విజ్ఙాన సంస్థ (ఎయిమ్స్ )కు తరలించారు. ఎయిమ్స్‌ ఆసుపత్రిలోని కార్డియో న్యూరో టవర్స్ విభాగంలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.

రెండు వారాల వ్యవధిలో ఆయన అనారోగ్యానికి గురి కావడం ఇది రెండోసారి. కిందటి నెల 2వ తేదీన ఆయన కరోనా వైరస్ బారిన పడ్డారు. కరోనా పాజిటివ్‌గా తేలడంతో గుర్‌గావ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందారు. కరోనా వైరస్ రిపోర్టులు నెగెటివ్‌గా రావడంతో అదేనెల 14 తేదీన డిశ్చార్జి అయ్యారు. నాలుగురోజుల తరువాత ఆయన మరోసారి అనారోగ్యానికి గురయ్యారు. 18వ తేదీన ఎయిమ్స్‌లో చేరారు. కరోనా వైరస్ నెగెటివ్ రిపోర్ట్ రావడం, ఆరోగ్యం మెరుగు పడటంతో 31వ తేదీన డిశ్చార్జి అయ్యారు.

Home Minister Amit Shah admitted to AIIMS again experiencing breathing issues

ఇంటి వద్దే విశ్రాంతి తీసుకుంటున్నారు. హఠాత్తుగా శనివారం రాత్రి అమిత్ షా ఆరోగ్యం తిరగబెట్టింది. శ్వాస పీల్చుకోవడంలో సమస్యలను ఎదుర్కొన్నారు. ఊపిరి పీల్చుకోవడం కష్టతరమైంది. డాక్టర్ల సూచనల మేరకు ఆయనను ఆసుపత్రికి తరలించారు. 11 గంటల సమయంలో ఎయిమ్స్‌కు తరలించారు. కార్డియో న్యూరో టవర్ విభాగంలో చేర్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.

డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచాల్సిన అవసరం ఏర్పడటం వల్లే ఎయిమ్స్‌ అడ్మిట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. అమిత్ షానకు కరోనా వైరస్ పరీక్షలను నిర్వహించారా? లేదా? అనేది తెలియరావాల్సి ఉంది. హఠాత్తుగా అమిత్ షా ఎయిమ్స్‌లో చేరడంతో ఆయన ఆరోగ్యం పట్ల దేశవ్యాప్తంగా ఆందోళనను వ్యక్తమౌతున్నాయి. భారతీయ జనతా పార్టీ నాయకులు, శ్రేణులు అమిత్ షా త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థనలు చేస్తున్నారు.

English summary
Home minister Amit shah has been re-admitted to AIIMS on Saturday night at around 11 PM. As per reports he has been experiencing breathing issues post his recovery from Coronavirus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X