వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

థ్యాంక్యూ నిర్మలాజీ: సామాన్యుడి కలలకు ప్రాణం పోశారు: అమిత్‌ షా, జేపీ నడ్డా.. !

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ఉదయం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్ పట్ల హోమ్ శాఖ మంత్రి అమిత్‌షా ప్రశంసించారు. ఇంతమంది బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్‌కు తాను ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. అయిదు ట్రిలియన్ మార్క్ ఆర్థికాభివృద్ధిని అందుకోవడమే లక్ష్యంగా ఈ బడ్జెట్‌ను ప్రతిపాదించారని, లక్ష్యాన్ని అందుకుని తీరుతామని ఆయన చెప్పారు.

బడ్జెట్‌లో పేద, మధ్య తరగతి కుటుంబీకుల ఆశలను ప్రతిఫలింపజేసిందని వారు అన్నారు. ఎస్సీలు, బలహీనవర్గాల అభ్యున్నతికి 2020-21 సంవత్సరంలో 85 వేల కోట్ల రూపాయలు, ఎస్టీల అభ్యున్నతి కోసం 53,700 కోట్ల రూపాయలను కేటాయించడం అభినందనీయమని అన్నారు. అట్టడుగు వర్గాల అభివృద్ధికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందనడానికి ఈ కేటాయింపులే నిదర్శనమని చెప్పారు.

Home Minister Amit Shah hails FM Sitharaman for development-oriented budget

నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగాన్ని ముగించిన కొద్దిసేపటికే అమిత్ షా వరుసగా ట్వీట్లు చేశారు. బడ్జెట్ అద్బుతంగా ఉందని చెప్పారు. పన్నుల వ్యవస్థను క్రమబద్దీకరించడం గొప్ప విషయమని అన్నారు. మౌలిక సదుపాయాలు, వ్యవసాయ రంగానికి పెద్ద ఎత్తున నిధులను కేటాయించారని, ఈ రెండూ దేశ ఆర్థిక ప్రగతికి బాటలు వేస్తాయని అమిత్ షా అన్నారు. ఆర్థిక రంగానికి మూల స్తంభంలా ఉంటోన్న బ్యాంకింగ్ వ్యవస్థను నిర్మలా సీతారామన్ ఒక్క బడ్జెట్‌తో బలోపేతం చేశారని ప్రశంసించారు.

అందరికీ నివాస వసతి, విద్యుత్, వ్యక్తిగత మరుగుదొడ్లు, ఇంటింటికీ కుళాయిల ద్వారా మంచినీటి సరఫరా వంటి అమోఘమైన పథకాలకు భారీ ఎత్తున బడ్జెట్ కేటాయించారని చెప్పారు. 3.60 లక్షల కోట్ల రూపాయలను వాటికి కేటాయించడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు. పెట్టుబడులను రాబట్టుకోవడానికి అందుబాటులో ఉన్న అన్ని రకాల వనరులను కూడా తమ ప్రభుత్వం వినియోగించుకుంటుందని, దానికి నిదర్శనమే ఈ బడ్జెట్ అని చెప్పారు.

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈడీబీ)ని సులభతరం, సరళీకృతం చేయడం వల్ల పెట్టుబడులు పెద్త ఎత్తున వస్తాయని అంచనా వేస్తున్నట్లు అమిత్ షా తెలిపారు. ఫలితంగా దేశ ఆర్థిక రంగం అతి త్వరలోనే అయిదు ట్రిలియన్ డాలర్ల అభివృద్ధిని అందుకుంటుందని అన్నారు. సమాజంలోని ప్రతి ఒక్క పౌరుడినీ, ప్రతి వర్గాన్నీ దృష్టిలో ఉంచుకుని ఈ బడ్జెట్‌ ద్వారా నిర్మలా సీతారామన్ వారి కలలకు ప్రాణం పోశారని కితాబిచ్చార బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు.

ఆధునిక భారత దేశ నిర్మాణానికి బడ్జెట్ మార్గం వేసిందని చెప్పారు. వ్యవసాయం, మౌలిక రంగాలు, విద్య, వైద్యం, పారిశ్రామికం.. ఇలా ప్రతి రంగానికి చెందిన వారి ఆశలకు జీవం పోశారని, ఇటీవలి కాలంలో ఇదే అత్యుత్తమ బడ్జెట్‌గా జేపీ నడ్డా ప్రశంసించారు. జల్ జీవన్ మిషన్ వంటి పథకాలకు భారీగా నిధులను కేటాయించడం హర్షించదగ్గ పరిణామమని చెప్పారు. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ అనే తమ ప్రభుత్వ నినానికి అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయని ప్రశంసించారు.

English summary
Union Home Minister Amit Shah on Saturday said that the Union Budget 2020-21 will further the Modi government's resolve to make India a USD-5 trillion economy. "In this budget, the Modi government has taken effective steps to rationalise the tax system.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X