వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాకిస్థాన్ - కాశ్మీర్ వ్యవహారంపై నెక్స్ట్ ఇదే : అమిత్ షా సంచలనం..!!

|
Google Oneindia TeluguNews

కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేసారు. జమ్ము కాశ్మీర్ పర్యటనలో భాగంగా బారాముల్లాలో జరిగిన ర్యాలీలో అమిత్ షా పాక్ తో చర్చల అంశం పైన స్పందించారు. 1990 నుంచి ఉగ్రవాదం కారణంగా జమ్ము కాశ్మీర్ లో 42 వేల మంది ప్రాణాలు కోల్పోయారని వివరించారు. జమ్ము కాశ్మీర్ లో అబ్దుల్లాలు (నేషనల్ కాన్ఫరెన్స్), ముఫ్తీలు (పీడీపీ), నెహ్రూ-గాంధీలు (కాంగ్రెస్) వల్ల అభివృద్ధి చెందలేదన్నారు. 1947లో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జమ్మూ-కశ్మీరు రాష్ట్రాన్ని వీరే పరిపాలించారని మండిపడ్డారు. వీరి పాలన అవినీతిమయమని ఆరోపించారు.

పాక్ తో చర్చల ప్రసక్తే లేదు

పాక్ తో చర్చల ప్రసక్తే లేదు

జమ్మూ-కశ్మీరు అభివృద్ధిలో వెనుకబడటానికి మూడు కుటుంబాలే కారణమని దుయ్యబట్టారు. ఉగ్రవాదం వలన ఎవరైనా లబ్ది పొందారా అని అమిత్ షా ప్రశ్నించారు. జమ్ము కాశ్మీర్ ను రానున్న రోజుల్లో శాంతి వనం గా ప్రధాని మోదీ ప్రభుత్వం మార్చుతుందని అమిత్ షా వెల్లడించారు. కాశ్మీర్ లోని ప్రాంతీయ పార్టీలతో పాటుగా కాంగ్రెస్ కూడా కాశ్మీర్ లో శాంతి నెలకొనాలంటే పాకిస్థాన్ లో చర్చలు జరపాలని సూచిస్తుండటంపై అమిత్ షా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. అసలు పాకిస్థాన్ తో ఎందుకు మాట్లాడాలని ప్రశ్నించారు. ఉగ్రవాదాన్ని ఎందుకు సహించాలంటూ నిలదీసారు. తాము పాకిస్థాన్ తో చర్చలు జరిపే ప్రసక్తే లేదని హోం మంత్రి అమిత్ షా తేల్చి చెప్పారు.

ఉగ్రవాదాన్ని తుది ముట్టిస్తాం

ఉగ్రవాదాన్ని తుది ముట్టిస్తాం

ఉగ్రవాదాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం సహించదని, దానిని తుదముట్టిస్తుందని చెప్పారు. జమ్మూ-కశ్మీరును దేశంలో అత్యంత ప్రశాంతంగా ఉండే ప్రదేశంగా మార్చాలనేది తమ లక్ష్యమని స్పష్టం చేసారు. బారాముల్లా ప్రజలతో మాట్లాడతాం, కశ్మీరు ప్రజలతో మాట్లాడతాం అన్నారు. కొందరు తరచూ పాకిస్థాన్ గురించి మాట్లాడుతున్నారని, అయితే పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరులోని ఎన్ని గ్రామాలకు విద్యుత్తు కనెక్షన్లు ఉన్నాయో వారికి తెలుసా అని ప్రశ్నించారు. కాశ్మీర్ లో ఈ మూడేళ్లలోనే అన్ని గ్రామాలకు విద్యుత్ వచ్చిందని అమిత్ షా వివరించారు. ఆర్టికల్ 370 రద్దు తరువాత కాశ్మీర్ లో వచ్చిన మార్పులను వివరించారు.

త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు

త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు

కాశ్మీర్ లోని అందరి ప్రజలతోనూ మాట్లాడుతామని వెల్లడించారు. వారి అన్ని సమస్యలు తెలుసుకొని ఖచ్చితంగా పరిష్కరిస్తామని ప్రకటించారు. త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడించారు.
3.రానున్న రోజుల్లో కాశ్మీర్ ను శాంతి వనంగా తీర్చి దిద్దుతామని చెప్పారు. ప్రధాని మోదీ నాయకత్వం లో పని చేస్తన్న కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ టెర్రరిజాన్ని ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. టెర్రరిజాన్ని తుది ముట్టిస్తామంటూ అమిత్ షా హెచ్చరించారు. జమ్ము కాశ్మీర్ లో మూడు రోజుల పర్యటనలో భాగంగా అమిత్ షా గురువారం అనేక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

English summary
Union Home Minister Amit Shah ruled out holding talks with Pakistan. Addressing a rally in Baramullah, will wipe out terrorism from Jammu and Kashmir.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X