వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమిత్ షా కు కరోనా నెగటివ్ - వారంలోపే కోలుకున్నారంటూ తివారీ ట్వీట్

|
Google Oneindia TeluguNews

కరోనా మహమ్మారి బారి నుంచి కేంద్ర హోం మంత్రి అమిత్ షా కోలుకున్నారని, తాజాగా నిర్వహించిన టెస్టుల్లో ఆయనకు నెగటివ్ వచ్చిందని వెల్లడైంది. షా సహచర బీజేపీ ఎంపీ, ఢిల్లీ బీజేపీ మాజీ చీఫ్ మనోజ్ తివారీ ఆదివారం ట్విటర్ లో ఈ సమాచారాన్ని షేర్ చేశారు. దీంతో దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు, షా అభిమానులు కుదుటపడ్డారు.

55ఏళ్ల అమిత్ షా.. జులై 29నాటి కేంద్ర కేబినెట్ భేటీ తర్వాత అస్వస్థతకు గురయ్యారు. కరోనా లక్షణాలతో ఈనెల 2న గుర్గావ్ లోని మేదాంత ఆస్పత్రిలో చేరారు. తనతో కాంటాక్ట్ అయినవాళ్లందరూ ఐసోలేషన్ లోకి వెళ్లి టెస్టులు చేయించుకోవాలని ఆయన సూచించారు. షా తర్వాత అర డజను మంది కేంద్ర మంత్రులు కరోనా పాజిటివ్ గా తేలడం గమనార్హం. వారిలో ''భాబీజీ అప్పడాలు తింటే కరోనా రాదంటూ'' ప్రచారం చేసిన అర్జున్ రామ్ మేఘావాల్ కూడా ఉన్నారు. మొత్తానికి వారం రోజుల్లోపే షా కొవిడ్ నుంచి కోలుకోవడం గమనార్హం.

8.5కోట్ల అకౌంట్లలోకి రూ.17 వేల కోట్లు - ఒక్క క్లిక్‌తో జమ చేసిన ప్రధాని మోదీ8.5కోట్ల అకౌంట్లలోకి రూ.17 వేల కోట్లు - ఒక్క క్లిక్‌తో జమ చేసిన ప్రధాని మోదీ

Home Minister Amit Shah tests negative for COVID-19 says BJP MP Manoj Tiwari

ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతూనే దేశంలో జరుగుతోన్న కీలక పరిణామాలపై అమిత్ షా క్రమం తప్పకుండా స్పందిస్తూ వచ్చారు. విజయవాడలోని కొవిడ్ సెంటర్ లో అగ్నిప్రమాదం తలెత్తి, 10 మంది చనిపోయిన ఘటనపై ఆయన విచారం వ్యక్తం చేశారు. పీఎం కిసాన్ నిధి కింద 8.5కోట్ల మంది పేద రైతుల ఖాతాల్లోకి ప్రధాని మోదీ రూ.17వేల కోట్లు జమచేయడంపై హర్షం వెలిబుచ్చారు. ఆగస్టు 15కు ముందు వారం రోజులపాటు ''గందగీ భారత్ చోడో'' నినాదంతో స్వచ్ఛత కార్యక్రమాలు చేపడదామంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును విజయవంతం చేద్దామంటూ షా శనివారం ఓ ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే..

కరోనా కేసుల్లో ఇండియా మరో రికార్డు - కొత్తగా 64,399, మొత్తం 21లక్షల కేసులు - 43వేల మంది బలి..కరోనా కేసుల్లో ఇండియా మరో రికార్డు - కొత్తగా 64,399, మొత్తం 21లక్షల కేసులు - 43వేల మంది బలి..

Recommended Video

Amit Shah Tests Coronavirus Positive ఆస్పత్రిలో చేరుతున్నా అని అమిత్ షా ట్వీట్ ! || Oneindia Telugu

దేశంలో కరోనా కేసులకు సంబంధించి మరో రికార్డు నమోదైంది. కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించిన లెక్కల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 64,399 కేసులు, 861 మరణాలు నమోదయ్యాయి. ఒకే రోజు బయటపడ్డ అతి పెద్ద సంఖ్య ఇదే. దీంతో మొత్తం కేసుల సంఖ్య 21.53లక్షలకు, మరణాల సంఖ్య దాదాపు 44వేలకు పెరిగింది.

English summary
Home Minister Amit Shah has tested negative for coronavirus, his BJP colleague and MP Manoj Tiwari tweeted on sunday. nearly a week after the Home Minister was hospitalised with the highly contagious COVID-19. Mr Shah is recovering at Medanta hospital in Gurugram near Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X