వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహిళల భద్రత కోసం ఢిల్లీ పోలీసుల 'హిమ్మత్' యాప్ అధ్బుతం (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఢిల్లీలో కొత్తగా ఏర్పడిన ఆమ్ ఆద్మీ పార్టీకి ఢిల్లీ పోలీసులు పూర్తి మద్దతుని తెలపాలని హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అదేశించారు. సోమవారం ఆయన ఢిల్లీ పోలీస్‌ 68వ రైజింగ్‌డే ఉత్సవాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఢిల్లీలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ప్రజలు ఇచ్చిన తీర్పుని మనందరం గౌరవించాలి. రాజధాని అభివృద్ధికి అందరూ తమ వంతు సహాకారం అందించాలని తెలిపారు.

ముఖ్యంగా ఢిల్లీలో మహిళల భద్రత మరో ప్రధాన అంశమన్నారు. మహిళలపై నేరాల దర్యాప్తునకు అన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి విధంగా కృషి చేస్తానన్నారు. మహిళల భద్రత కోసం ఢిల్లీ పోలీసులు ప్రవేశపెట్టిన "హిమ్మత్" అనే యాప్‌ను రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసించారు. ఢిల్లీ పోలీస్ 'స్మార్ట్ పోలీస్' అనేది ప్రధాని మోడీ కల అని దానిని గ్రహించి ఢిల్లీ పోలీసులు నడుచుకోవాలన్నారు.

ఇటీవల కాలంలో ఢిల్లీలో చర్చిలపై దాడులు పెరిగాయని, అలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులకు సూచించారు. ఢిల్లీ వివిధ మతాలకు చెందిన వారు నివసిస్తుంటారు. చిన్న చిన్న విషయాలు ఒక్కో సమయంలో పెద్దవిగా కనిపిస్తాయి. అలాంటివి ఢిల్లీ పోలీసులు ఇమేజిని తగ్గిస్తాయని చెప్పారు.

ఇక ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చే ప్రజల భద్రతపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈశాన్య రాష్ట్రాల ప్రజలు అభద్రత భావానికి లోనుకాకుండా చూసే భాద్యత పోలీసులపై ఉందన్నారు. ఢిల్లీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అరవింద్ కేజ్రీవాల్, మంత్రి వర్గాన్ని ఈ కార్యక్రమానికి ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ ఆహ్వానించినా వారు గైర్వాజరయ్యారు.

ఢిల్లీ పోలీసుల 'హిమ్మత్' యాప్ అధ్బుతం

ఢిల్లీ పోలీసుల 'హిమ్మత్' యాప్ అధ్బుతం

సోమవారం ఢిల్లీ పోలీస్‌ 68వ రైజింగ్‌డే ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఢిల్లీ పోలీసు విభాగంలో 41 సంవత్సరాలు సేవలు చేసినందుకు గాను నిర్మల్ ఎస్ ధిల్లాన్‌ను సన్మానిస్తున్న హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్.

ఢిల్లీ పోలీసుల 'హిమ్మత్' యాప్ అధ్బుతం

ఢిల్లీ పోలీసుల 'హిమ్మత్' యాప్ అధ్బుతం

సోమవారం ఢిల్లీ పోలీస్‌ 68వ రైజింగ్‌డే ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఢిల్లీ పోలీసులతో గ్రూప్ ఫోటోకు ఫోజులిచ్చిన కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్.

 ఢిల్లీ పోలీసుల 'హిమ్మత్' యాప్ అధ్బుతం

ఢిల్లీ పోలీసుల 'హిమ్మత్' యాప్ అధ్బుతం

సోమవారం ఢిల్లీ పోలీస్‌ 68వ రైజింగ్‌డే ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఢిల్లీ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తున్న కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ.

 ఢిల్లీ పోలీసుల 'హిమ్మత్' యాప్ అధ్బుతం

ఢిల్లీ పోలీసుల 'హిమ్మత్' యాప్ అధ్బుతం

సోమవారం ఢిల్లీ పోలీస్‌ 68వ రైజింగ్‌డే ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఢిల్లీలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ప్రజలు ఇచ్చిన తీర్పుని మనందరం గౌరవించాలి. రాజధాని అభివృద్ధికి అందరూ తమ వంతు సహాకారం అందించాలని తెలిపారు.

English summary
Union Home Minister Rajnath Singh today asked the Delhi Police to work in close cooperation with Arvind Kejriwal's new Aam Aadmi Party government in the capital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X