వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కారణమిది: చైనా సరిహద్దు వెంట పర్యటించనున్న రాజ్‌నాథ్‌సింగ్

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: డోక్లామ్ వద్ద చైనాతో సరిహద్దు వివాదం నెలకొన్న నేపథ్యంలో చైనా సరిహద్దులో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పర్యటించనున్నారు. ఈ వారంలో రాజ్‌నాథ్‌సింగ్ చైనా సరిహద్దుల్లో పర్యటించనున్నారని ఆర్మీ అధికారులు ప్రకటించారు.

.చైనాతో డోక్లామ్ వద్ద నెలకొన్న వివాదాన్ని దౌత్యపరంగా రెండు దేశాలు పరిష్కరించుకొన్నాయి. ఇటీవల చైనా బలాగాలు సరిహద్దును అతిక్రమించి భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చిన నేపథ్యంలో రాజ్‌నాథ్‌ పర్యటనకు ప్రాముఖ్యత ఏర్పడింది.

భారతీయ బలగాలు సమర్థవంతంగా ఎదుర్కోవడంతో.. చైనా బలగాలు వెనక్కు మళ్లిన సంగతి తెలిసిందే. హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఈ పర్యటనలో ఇండో టిబెటన్‌ సరిహద్దు బలగాలతో ప్రత్యేకంగా సమావేశమవుతున్నట్లు తెలుస్తోంది.

Home Minister Rajnath Singh To Visit Sino-Indian Border Areas

డోక్లామ్‌ వివాదం ముగిసిన తరువాత కేంద్ర అత్యున్నత మంత్రి ఈ ప్రాంతంలో పర్యటించడం ఇదే తొలిసారి. భూమి 12,500 అడుగుల ఎత్తులో ఉన్న రిమ్‌కిమ్‌, 10,500 అడుగుల ఎత్తులో ఉన్న మనా, 10,200 అడుగుల ఎత్తులో ఉన్న ఆర్మీ పోస్టులను రాజ్‌నాథ్‌ ఈ నెల 28న సందర్శిస్తారని ఆర్మీ వర్గాలు ప్రకటించాయి.

జూలై 25న చైనా బలగాలు ఉత్తరాఖండ్‌లోని ఛమోలి జిల్లాలోని సరిహద్దు ప్రాంతమైన బార్హోతిలోకి 800 అడుగుల మేర చొచ్చుకుని వచ్చి.. కొన్ని గంటలు ఉండి.. తిరిగి వెనక్కు వెళ్లాయి.

ఈ పర్యటనలోనే కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ముస్సోరిలోని లాల్‌బహుదూర్‌ శాస్త్రి నేషనల్‌ అకాడమీ అఫ్‌ అడ్మినిస్ట్రేషన్‌లోని శిక్షణ కొందుతున్న యువ ఐఏఎస్‌, ఐపీఎస్‌లను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అలాగే చైనా సరిహద్దులో నిర్మిస్తున్న రహదారి పనులను రాజ్‌నాథ్ పర్యవేక్షిస్తారు.

English summary
Home Minister Rajnath Singh will this week visit a Sino-Indian border area in Uttarakhand which has witnessed transgression by China's People's Liberation Army in the recent past, officials said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X