వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డిగ్రీ, పీజీ ఫైనల్ ఇయర్ పరీక్షలకు హోంశాఖ అనుమతి, వైద్యారోగ్యశాఖ మార్గదర్శకాల మేరకే..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ వల్ల లాక్‌డౌన్ కొనసాగుతుండటంతో స్కూళ్లు, కాలేజీలు మూసివేసి ఉన్నాయి. మార్చి నుంచి విద్యా సంస్థలు క్లోజ్ చేసే ఉన్న సంగతి తెలిసిందే. పదో తరగతి పరీక్షలను పాస్ చేయగా.. డిగ్రీ, పీజీ పరీక్షలపై మాత్రం ఉత్కంఠ కొనసాగుతుండగా... కేంద్ర హోంశాఖ క్లారిటీ ఇచ్చింది. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం ఫైనల్ టర్మ్ పరీక్షలు కచ్చితంగా నిర్వహించాలని హోంశాఖ తేల్చిచెప్పింది. వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన స్టాండర్ట్ ఆపరేటింగ్ ప్రొజిసర్ ప్రకారం కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహించాలని హోంశాఖ సూచించింది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ కార్యదర్శికి లేఖ రాసింది.

 Home Ministry Allows Final Year Exams, UGCs Revised Guidelines Released..

మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, హర్యానా, రాజస్థాన్ ఉన్నత విద్యా పరీక్షలు రద్దు చేసిన సంగతి తెలిసిందే. పై తరగతులకు ప్రమోట్ చేసి.. ఇంటర్నల్ మార్కుల ఆధారంగా ఫలితాలను వెల్లడించాయి. గుజరాత్ ప్రభుత్వం మాత్రం ఫైనల్ ఇయర్ పరీక్షలను నిర్వహిస్తామని ప్రకటించి.. నిర్వహించబోమని తేల్చిచెప్పాయి. కానీ పరీక్షలు నిర్వహించుకోవచ్చని హోంశాఖ స్పష్టం చేయడంతో. పరీక్షల నిర్వహణపై వర్సిటీలు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Recommended Video

AP లో త్వరలో తెరుచుకోనున్న Schools - మంత్రి సురేష్ || Oneindia Telugu

ఏపీలో కూడా డిగ్రీ, పీజీ విద్యార్థులను ప్రమోట్ చేయాలని డిమాండ్ వచ్చింది. రాజకీయ పార్టీలు కోరగా.. ఆ అంశంపై ప్రభుత్వం ఆలోచన చేయబోతుంది. ఈ క్రమంలోనే హోంశాఖ నిర్ణయం రావడంతో పరీక్షలు నిర్వహించడం తప్పనిసరి అయ్యింది. డిగ్రీ, పీజీ ఫైనల్ సెమిస్టర్ పరీక్షలను ఆఫ్ లైన్, లేదా ఆన్ లైన్ పద్ధతిలో సెప్టెంబర్ నెలాఖరు వరకు పరీక్షలు నిర్వహించాలని స్పష్టంచేసింది.

English summary
Ministry of Home Affairs, in a letter to Union Higher Education Secretary, today permitted conduct of examinations by universities and institutions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X