వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమిత్ షా పేషీలో భారీగా అవినీతి: రూ.16 లక్షల లంచం డిమాండ్!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తరువాత ఆ స్థాయిలో శక్తిమంతమైన నాయకుడిగా పేరుంది కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షానకు. అవినీతికి పాల్పడిన, లంచం రుచి మరిగిన అధికారులను బలవంతంగా ఉద్యోగం నుంచి స్వచ్ఛందంగా పదవీ విరమణ చేయించిన ఘనత ఆయనకు ఉంది. అలాంటి నాయకుడి సొంత పేషీలో ఓ అవినీతి అనకొండ వెలుగులోకి వచ్చింది. అయిదు కాదు, పదీ కాదు.. ఏకంగా 16 లక్షల రూపాయలను లంచంగా డిమాండ్ చేసిన ఓ సాధారణ సెక్షన్ ఆఫీసర్ ను సీబీఐ అధికారులు గురువారం అరెస్టు చేశారు. ఆ అధికారి పేరు ధీరజ్ కుమార్ సింగ్. ఓ కేసు విషయంలో నిందితుడి నుంచి 16 లక్షల రూపాయల నగదును తీసుకుంటూ సీబీఐ అధికారుల చేతికి చిక్కారాయన.

టీడీపీ అజెండాను బీజేపీ మోస్తోంది..నిర్వీర్యం కావడం తథ్యం?: ఐవైఆర్టీడీపీ అజెండాను బీజేపీ మోస్తోంది..నిర్వీర్యం కావడం తథ్యం?: ఐవైఆర్

ఓ సీనియర్ ఐపీఎస్ అధికారిపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన కేసు అది. తనపై వచ్చిన విచారణను తప్పించేలా ఆ ఐపీఎస్ అధికారి.. సెక్షన్ ఆఫీసర్ ధీరజ్ కుమార్ సింగ్ తో రెండు కోట్ల రూపాయల బేరాన్ని కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా- తొలి విడతగా ఆయన 16 లక్షల రూపాయల నగదును ఆయనకు అందజేశారు. దీనిపై పక్కా సమాచారం అందడంతో..

Home Ministry Official Arrested With Rs. 16 Lakh Bribe Money

సీబీఐ అధికారులు వల పన్ని మరీ ఆయనను అరెస్టు చేశారు. ఆయన వద్ద నుంచి 16 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ధీరజ్ కుమార్ సింగ్ తో బేరం కుదుర్చుకున్న ఆ ఐపీఎస్ అధికారి ఎవరనేది ఇంకా తెలియ రాలేదు. దీనిపై సీబీఐ అధికారులు ఆరా తీస్తున్నారు. ధీరజ్ కుమార్ సింగ్ పై కేసు నమోదు చేశారు. ఆయనను కస్టడీకి తరలించారు.

English summary
The Central Bureau of Investigation (CBI) on Thursday arrested an employee of the Ministry of Home Affairs with Rs. 16 lakh in bribe money, officials said. A senior CBI official told, "We have arrested Dheeraj Kumar Singh posted as an section officer in the Ministry of Home Affairs in a trap case this morning with an alleged bribe of Rs. 16 lakh." CBI sources said that Singh was trying to influence a case involving an Indian Police Service (IPS) officer and had approached the agency's investigating officer with an offer of Rs. two crore to settle the matter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X