వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇది ఆర్మీ మాట: స్వలింగసంపర్కం వ్యభిచారంపై ఆర్మీ ఇచ్చిన నివేదిక ఏంటి..?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత ఆర్మీలో స్వలింగసంపర్కం, వ్యభిచారం జరుగుతున్నాయా...? క్రమశిక్షణ ఉండటం లేదా..? మరి రక్షణశాఖకు ఆర్మీ ఈ రెండు అంశాలపై నివేదిక ఎందుకు ఇచ్చింది...? స్వలింగసంపర్కం, వ్యభిచారం నేరాలు కాదని గతేడాది సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఆర్మీ అధికారులు డిఫెన్స్ శాఖకు నివేదిక ఎందుకు సమర్పించారు..?

స్వలింగసంపర్కం, వ్యభిచారం నేరమే

స్వలింగసంపర్కం, వ్యభిచారం నేరమే

స్వలింగసంపర్కం, వ్యభిచారంను ఆర్మీలో నేరంగా పరిగణించాలంటూ ఆర్మీ అధికారులు రక్షణశాఖకు నివేదిక అందించినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఆర్మీ చట్టాల్లో జవాన్లు స్వలింగసంపర్కంకు పాల్పడ్డా, వ్యభిచారంకు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవచ్చని ఉందని రక్షణశాఖకు అందజేసిన నివేదికలో ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే స్వలింగ్ సంపర్కం, వ్యభిచారం అనేది నేరం కాదని గతేడాది సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ క్రమంలోనే ఆర్బీకి ప్రత్యేక చట్టం ఉందని ఇందుకోసమే రక్షణశాఖకు మరో నివేదిక ఇచ్చినట్లు సమాచారం.

 క్రమశిక్షణ ఉల్లంఘించే అవకాశం ఉంది

క్రమశిక్షణ ఉల్లంఘించే అవకాశం ఉంది

ఆర్మీలో జవాన్లు స్వలింగసంపర్కం, వ్యభిచారం చేస్తే వారిపై చర్యలు ఉండాలని లేనిపక్షంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును చూపించి ఆర్మీ జవాన్లు క్రమశిక్షణ తప్పే అవకాశం ఉందని రక్షణశాఖకు ఇచ్చిన నివేదికలో ఆర్మీ ఉన్నతాధికారులు పేర్కొనట్లు సమాచారం. కొన్ని కేసుల్లో తీర్పులు చట్టపరంగా సరైనవై ఉండొచ్చు కానీ నైతికంగా అవి ముమ్మాటికీ తప్పే అని అడ్జుటెంటె జనరల్ శాఖకు చెందిన జనరల్ అశ్వనీ కుమార్ అన్నారు. అడ్జుటెంట్ జనరల్ శాఖ జవాన్లపై వచ్చే అన్ని ఫిర్యాదులను డీల్ చేయడమే కాకుండా జవాన్ల సంక్షేమం కోసం పాటుపడుతుంది. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై ఆర్మీ రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తుందా అన్న ప్రశ్నకు ఇలాంటి వాటికోసం ఆర్మీలో చట్టంలో ప్రత్యేక సెక్షన్లు ఉన్నాయని చెప్పారు.

ఆర్మీ చట్టంలో సెక్షన్లు ఏం చెబుతున్నాయి

ఆర్మీ చట్టంలో సెక్షన్లు ఏం చెబుతున్నాయి

ఇప్పటి వరకు ఒక అధికారిపై లేదా ఒక జవానుపై హోమోసెక్సువాలిటీ లేదా వ్యభిచారం ఆరోపణలు వస్తే దాన్ని ఆర్మీ చట్టంలోని సెక్షన్ 46 కింద పరిగణిస్తామని చెప్పారు. ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసినందుకు గాను చర్యలు తీసుకుంటున్నట్లు ఆ సెక్షన చెబుతుందని చెప్పారు. అంతకుముందు సెక్షన్ 45 కింద చర్యలు తీసుకునేవారమని జనరల్ అశ్వనీ చెప్పారు. ఇప్పటి వరకు సెక్షన్ 46 కింద ఐదు నుంచి ఆరు మంది ఆఫీసర్లపై చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పిన జనరల్ అశ్వనీ కుమార్ వారు చేసిన నేరం గురించి వివరంగా చెప్పలేదు.

 గేసెక్స్, వ్యభిచారం ఆర్మీలో సహించేది లేదు: బిపిన్ రావత్

గేసెక్స్, వ్యభిచారం ఆర్మీలో సహించేది లేదు: బిపిన్ రావత్

ఆర్మీలో స్వలింగ సంపర్కం, వ్యభిచారం ఇప్పటికీ నిషేధంలో ఉన్నాయి. పరిభాషలో చెప్పాలంటో ఒక ఆర్మీ అధికారి తన సోదరుడి భార్యతో తప్పుగా ప్రవర్తించినా అధి వ్యభిచారం కిందకే వస్తుందని అట్టివారిపై ఆర్మీ చట్టం కింద చర్యలు తీసుకుంటారు. ఆర్మీలో గే సెక్స్, వ్యభిచారం ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ ఈ ఏడాది ప్రారంభంలో చెప్పారు. ఇలా జరుగుతాయని తెలిసే ఆర్మీ చట్టంలో ఓ సెక్షన్‌ పొందుపర్చినట్లు చెప్పారు.

English summary
The Army wants homosexuality and adultery to remain as punishable offences to ensure discipline and has made a representation to the Defence Ministry, a year after the Supreme Court decriminalised these acts, sources said on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X