వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్వలింగ సంపర్కం చట్ట విరుద్ధం: సుప్రీంకోర్టు షాక్

By Pratap
|
Google Oneindia TeluguNews

Homosexuality is an offence, Supreme Court rules
న్యూఢిల్లీ: స్వలింగ సంపర్కులకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. స్వలింగ సంపర్కం నేరమని సుప్రీంకోర్టు ఆదేశించింది. స్వలింగ సంపర్కం నేరం కాదంటూ 2009లో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు బుధవారం తోసిపుచ్చింది. భారత రాజ్యాంగం శిక్షాస్మృతిలోని 377వ సెక్షన్ ప్రకారం ఆనల్ సెక్స్ శిక్షార్హమైన నేరమని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

ఢిల్లీ హైకోర్టు ద్వారా స్వలింగ సంపర్కానికి ఆమోదం పొందిన ఎల్‌జిబిటి కార్యకర్తలు కోర్టులోనే ఏడ్చేశారు. పార్లమెంటుకు 377 సెక్షన్‌ను అధికారం ఉందని, అయితే ఆ సెక్షన్ ఉన్నంత కాలం ఒకే లింగానికి చెందినవారి మధ్య లైంగిక సంపర్కం న్యాయబద్దం కాదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.

పలు పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయమూర్తులు జిఎస్ సింఘ్వీ, ఎస్‌జె ముఖోపాధ్యాయలతో కూడిన సుప్రీకోర్టు బెంచ్ తమ తీర్పును ఈ నెల 27వ తేదీన రిజర్వ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. బుధవారం తీర్పును వెలువరించారు.

గే సెక్స్ నేరం కాదంటూ ఢిల్లీ హైకోర్టు 2009 జులై 2వ తేదీన ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పింది. స్వలింగ సంపర్కంపై రెండు వర్గాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చే్స్తూ వస్తున్నాయి.

English summary
The Supreme Court on Wednesday set aside the decision of the Delhi high court, which had in 2009 decriminalised sexual relation between persons belonging to same sex.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X