వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీలో హనీప్రీత్ సింగ్... ముందస్తు బెయిల్ కోసం పిటిషన్!

కానీ హనీప్రీత్ ఢిల్లీలో మకాం వేసినట్లు విశ్వసనీయ సమాచారం. అంతేకాదు, ఆమె ముందస్తు బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ కూడా వేసింది. ఆమె తనతో రోజూ మాట్లాడుతూనే ఉన్నారని, కానీ ఎక్కడుందో మాత్రం తెలియ

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: డేరాబాబా కేసులో కీలక నిందితురాలు హనీప్రీత్ ఢిల్లీలోనే మకాం వేసినట్లు తెలుస్తోంది. సాధ్వీలపై అత్యాచారం కేసుల్లో డేరాబాబాకు జైలుశిక్ష పడిన అంతరం హనీప్రీత్ మాయమైన సంగతి తెలిసిందే.

హర్యానా సిట్ అధికారులు హనీ ప్రీత్ ఆచూకీ కోసం కోసం దేశ వ్యాప్తంగా గాలిస్తున్నారు. ఆమె నేపాల్ కు పారిపోయినట్లు కూడా వార్తలు హల్ చల్ చేశాయి. మరోసారి బీహార్ లో కనిపించిందంటూ పుకార్లు వచ్చాయి.

ఢిల్లీలో హనీప్రీత్ మకాం...

ఢిల్లీలో హనీప్రీత్ మకాం...

కానీ హనీప్రీత్ ఢిల్లీలో మకాం వేసినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం ఆమె ఢిల్లోనే ఉన్నట్టు చెబుతున్నప్పటికీ... దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఢిల్లీలో ఆమె ఎక్కడ ఉందో ఎవరికీ అంతుబట్టడం లేదు.

హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్..

హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్..

ముందస్తు బెయిల్ దరఖాస్తుపై సంతకం చేసేందుకు సోమవారం హనీప్రీత్ సింగ్ తన కార్యాలయానికి వచ్చినట్టు ఆమె న్యాయవాది ప్రదీప్ ఆర్య వెల్లడించారు. హనీప్రీత్ ఇన్సాన్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ మంగళవారం ఢిల్లీ హైకోర్టులో విచారణకు రానున్నట్టు ఆయన పేర్కొన్నారు.

రోజూ మాట్లాడుతున్నా.. ఆచూకీ తెలియదు

రోజూ మాట్లాడుతున్నా.. ఆచూకీ తెలియదు

హనీప్రీత్ సింగ్‌ తనతో రోజూ మాట్లాడుతున్నారని ఆమె న్యాయవాది ఆర్య చెబుతున్నారు. అయితే ఆమె ప్రస్తుతం ఎక్కడున్నారన్న సంగతి మాత్రం తనకు తెలియదని ఆయన పేర్కొంటున్నారు. తన క్లయింటుకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా మంగళవారం తాను ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించనున్నట్టు ఆర్య పేర్కొన్నారు.

తీవ్ర కలతలో హనీప్రీత్...

తీవ్ర కలతలో హనీప్రీత్...

‘‘డేరాబాబాను దోషిగా నిర్ధారించడం.. తనకు, గుర్మీత్‌కు మధ్య అక్రమ సంబంధాలున్నట్టు ప్రచారం చేయడంపై హనీప్రీత్ సింగ్ తీవ్ర కలతకు గురయ్యారు. దీనిపై అత్యవసర విచారణ చేపట్టాల్సిందిగా కోర్టును కోరనున్నాం. ప్రాథమికంగా ఆమెపై దేశద్రోహం కేసు పెట్టారు. ఆమెపై అలాంటి అభియోగాలు మోపడం సరైంది కాదు...'' అని ఆర్య వ్యాఖ్యానించారు.

English summary
Honeypreet Insan, who has been on the run following the conviction of Dera Sacha Sauda chief Gurmeet Ram Rahim Singh in two rape cases, on Monday approached the Delhi High Court seeking transit anticipatory bail, her lawyer said. Priyanka Taneja alias Honeypreet, the adopted daughter of the jailed Dera chief+ , tops the list of 43 persons 'wanted' by the Haryana Police+ in connection with incidents of violence that had followed Ram Rahim's conviction in the rape cases. Earlier, a lookout notice was issued against Honeypreet by the police. Her lawyer Pradeep Kumar Arya told PTI that they have filed the anticipatory bail petition in the Delhi High Court and the matter would be mentioned tomorrow before a bench headed by Acting Chief Justice Gita Mittal for early hearing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X