వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హనీప్రీత్ అరెస్ట్: హర్యానా ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు

డేరా బాబా దత్తపుత్రిక హనీప్రీత్ అరెస్ట్ వ్యవహారంపై హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె అరెస్ట్ విషయంలో పంజాబ్ పోలీసుల పాత్రపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

|
Google Oneindia TeluguNews

Recommended Video

Haryana Chief Ministers Sensational Comments On Honeypreet | Oneindia Telugu

చండీగఢ్: డేరా బాబా దత్తపుత్రిక హనీప్రీత్ అరెస్ట్ వ్యవహారంపై హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె అరెస్ట్ విషయంలో పంజాబ్ పోలీసుల పాత్రపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

ఏమడిగినా అదే జవాబు: పోలీసులకు హనీప్రీత్ చుక్కలు, ఎదురు ప్రశ్నఏమడిగినా అదే జవాబు: పోలీసులకు హనీప్రీత్ చుక్కలు, ఎదురు ప్రశ్న

దాల్ మే కుచ్ కాలా హై

దాల్ మే కుచ్ కాలా హై

చండీగఢ్ హైవేలో హనీప్రీత్‌ను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. 'దాల్ మే కుచ్ కాలా హై' (అనుమానించదగ్గ విషయం ఉంది) అన్నారు. పంజాబ్ పోలీసులకు హనీప్రీత్ గురించి సర్వమూ తెలుసునని, వారు తమతో సమాచారాన్ని పంచుకోలేదని ఆరోపించారు.

అందుకే ఆలస్యమైంది

అందుకే ఆలస్యమైంది

పోలీసులు హనీప్రీత్‌ను ట్రాక్ చేశారని, తమకు విషయం చెబితే ఆమెను మరింత త్వరగా పట్టుకుని ఉండేవాళ్లని సీఎం అన్నారు. తమ ప్రమేయం లేనందునే అరెస్ట్ ఆలస్యం అయిందన్నారు.

 ఆ తర్వాత ఏం జరిగింది

ఆ తర్వాత ఏం జరిగింది

మరోవైపు, తమ విచారణలో హనీప్రీత్ సరైన సమాధానాలు చెప్పకపోవడంతో ఆమెకు లైడిటెక్టర్ పరీక్షలను చేసేందుకు అనుమతి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరనున్నట్టుగా తెలుస్తోంది. ఆమెను పంచకుల సెక్టార్ 20లోని రాంపూర్ జైల్లో ఉంచిన పోలీసులు, గుర్మీత్ తో సంబంధాలు, ఆయన జైలుకు వెళ్లిన తర్వాత జరిగిన విధ్వంసం గురించి సమాచారాన్ని రాబట్టేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.

 హనీప్రీత్‌కు ఓ నేత కూతురు సాయం

హనీప్రీత్‌కు ఓ నేత కూతురు సాయం

ఆమె దాదాపు నెల రోజులకు పైగా తప్పించుకోవడానికి ఓ పంజాబ్ నేత కుమార్తె కారణమని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. గుర్మీత్ కుమారుడిని వివాహం చేసుకున్న సదరు నేత కుమార్తె, హనీప్రీత్ తప్పించుకునేందుకు సహకరించిందని, తన పరపతిని వాడి, ఆమెకు రక్షణ కల్పించిందని అంటున్నారు.

English summary
A blame game today erupted between the chief ministers of Haryana and Punjab over the arrest of Honeypreet Insan who claims to be the adopted daughter of the jailed Dera Sacha Sauda chief.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X