వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుర్మీత్ నాకు తండ్రి, అన్నీ చెప్పేస్తా: కోర్టులో ఏడ్చేసిన హనీప్రీత్

డేరా బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ దత్త పుత్రిక హనీప్రీత్ ఇన్సాన్‌ను న్యాయస్థానం ఆరు రోజుల పోలీసు కస్టడీకి అప్పగించింది. పలు విషయాలను హనీప్రీత్ నుంచి పోలీసులు రాబట్టనున్నారు.

|
Google Oneindia TeluguNews

Recommended Video

"Gurmeet Is My Father" Honeypreet Says And Cried @ Court | Oneindia Telugu

ఢిల్లీ: డేరా బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ దత్త పుత్రిక హనీప్రీత్ ఇన్సాన్‌ను న్యాయస్థానం ఆరు రోజుల పోలీసు కస్టడీకి అప్పగించింది. పలు విషయాలను హనీప్రీత్ నుంచి పోలీసులు రాబట్టనున్నారు.

డేరాబాబాతో ఆ సంబంధం నిజమా.. ప్రశ్నలు సిద్ధం: హనీప్రీత్‌తో మరో మహిళడేరాబాబాతో ఆ సంబంధం నిజమా.. ప్రశ్నలు సిద్ధం: హనీప్రీత్‌తో మరో మహిళ

డేరా బాబా అరెస్టు అనంతరం అల్లర్లలో ఆమె పాత్ర ఉందని భావిస్తున్నారు. అంతేకాకుండా, గుర్మీత్ అరెస్టు అనంతరం డేరా నుంచి విలువైన వస్తువులు, డబ్బు మరోచోటికి తరలించినట్లుగా భావిస్తున్నారు.

ఆరు రోజుల పోలీస్ కస్టడీకి అప్పగింత

ఆరు రోజుల పోలీస్ కస్టడీకి అప్పగింత

డేరా బాబాతో మంచి సంబంధాలు ఉన్న హనీప్రీత్‌ను విచారిస్తే కీలక విషయాలు రాబట్ట వచ్చునని పోలీసులు భావిస్తున్నారు. అందుకోసం ఆమెను కోర్టులో ప్రవేశ పెట్టి, కస్టడీ కోరారు. దీంతో న్యాయస్థానం ఆమెను ఆరు రోజుల పోలీస్ కస్టడీకి అప్పగించింది.

దేశద్రోహం కేసు, హనీప్రీత్ కంటతడి

దేశద్రోహం కేసు, హనీప్రీత్ కంటతడి

డేరా బాబా అరెస్టు అనంతరం హింసను ప్రేరేపించారంటూ హనీప్రీత్ ఇన్సాన్ పైన పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు. పోలీసులు కోర్టులో ప్రవేశ పెట్టిన సమయంలో హనీప్రీత్ న్యాయస్థానంలోనే కన్నీరు పెట్టుకుంది. తనపై అబద్దపు కేసులు పెట్టారని ఆమె ఒక్కసారిగా ఏడ్చింది.

అక్రమ సంబంధంపై హనీప్రీత్ ఆవేదన

అక్రమ సంబంధంపై హనీప్రీత్ ఆవేదన

డేరా అల్లర్లతో తనకు ఎలాంటి సంబంధం లేదని హనీప్రీత్ కోర్టు నుంచి బయటకు వచ్చిన అనంతరం వెల్లడించింది. గుర్మీత్ తనకు తండ్రిలాంటి వాడని, ఆయనతో అక్రమ సంబంధం అంటగట్టడం సరికాదని ఆవేదన వ్యక్తం చేసింది. తనపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పింది. పోలీసుల ప్రశ్నలకు సమాధానం చెబుతానని చెప్పింది. అన్ని వివరాలు చెబుతానన్నది.

గుర్మీత్ హిందువు కావటం వల్లే

గుర్మీత్ హిందువు కావటం వల్లే

గుర్మీత్ రామ్ రహీం సింగ్ హిందువు కావడం వల్లే ఆయనకీ దుర్గతి పట్టిందని ఆయన అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తామంతా ఇస్లాంలో చేరుతామంటూ సంచలన ప్రకటన చేశారు. సాధ్వీలపై అత్యాచారం కేసులో గుర్మీత్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. హిందూ సంస్థలు చాలా సులభంగా టార్గెట్ అవుతున్నాయని, గుర్మీత్ హిందువు కావడం వల్లే ఆయన జైలుకు వెళ్లారని డేరా అనుచరులు ఆరోపించారు.

డేరా అధికార ప్రతినిధి

ఈ మేరకు సోషల్ మీడియాలో డేరా అధికార ప్రతినిధి సందీప్ మిశ్రా ముఖానికి మాస్క్ ధరించి మాట్లాడుతున్న వీడియో ఒకటి చక్కర్లు కొడుతోంది. సిర్సాలో ఈ వీడియోను చిత్రీకరించారు. అందులో ఆయన మాట్లాడారు. పలువురు ముస్లీం ప్రముఖులతో టచ్‌లో ఉన్నట్లు కూడా చెబుతున్నారు.

సొంత దేశంలో హిందువుగా పుట్టడం నేరం

సొంత దేశంలో హిందువుగా పుట్టడం నేరం

మీరు హిందూస్థాన్‌ను అభిమానిస్తే మీ కంటి నుంచి నీరు తప్ప మరేమీ రాదని, మన సొంత దేశంలో హిందువుగా ఉండడం నేరం అయిందని పేర్కొన్నారు. అందుకే మతం మారితే రక్షణ ఉంటుందని సందీప్ మిశ్రా అభిప్రాయపడ్డారు.

ముస్లీంలను తాకే సాహసం ఎవరూ చేయరు

ముస్లీంలను తాకే సాహసం ఎవరూ చేయరు

ఆ వెంటనే ముసుగు ధరించి ఆయన వెనకవైపు ఉన్న మరో వ్యక్తి మాట్లాడుతూ.. ఇస్లాంలో చేరడం వల్ల చాలా లాభాలు ఉన్నాయని పేర్కొన్నాడు. ముస్లింలను తాకే సాహసం కూడా ఎవరూ చేయబోరని అన్నాడు. వారు రాళ్లు విసిరినా వారిని ఏమైనా అనే ధైర్యం ఎవరికీ ఉండదన్నాడు. తమ నాయకులు ముస్లిం లీడర్లతో మాట్లాడుతున్నారన్నాడు. కాగా, ఇదంతా గుర్మీత్ ఆడిస్తున్న డ్రామా అని, మతం కార్డును ఎలా వాడుకోవాలో ఆయనకు తెలుసునని కొందరు అంటున్నారు.

English summary
Honeypreet Insan, the ‘adopted daughter’ of Gurmeet Ram Rahim, is finally in custody of the Haryana Police after being on the run for almost 40 days. She had been on the list of 43 persons 'wanted' by the Haryana Police in connection with the probe into the self-styled godman’s activities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X