వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలీసులకు లొంగిపోనున్న హనీప్రీత్!? ఆమె లాయర్ సలహా అదేనట..

నెల రోజుల నుంచి పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న డేరాబాబా ‘దత్తపుత్రిక’ హనీప్రీత్ సింగ్ ఇక లొంగిపోయేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: నెల రోజుల నుంచి పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న డేరాబాబా 'దత్తపుత్రిక' హనీప్రీత్ సింగ్ ఇక లొంగిపోయేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. పంజాబ్- హర్యానా హైకోర్టులో ఆమె పోలీసులకు గురువారం లొంగిపోనున్నట్టు చెబుతున్నారు.

హనీప్రీత్ సింగ్‌ను కోర్టు ముందు లొంగిపోవాల్సిందిగా తాను సూచించినట్టు ఆమె లాయర్ ప్రదీప్ కుమార్ ఆర్య పేర్కొన్నారు. ఫోన్ ద్వారా ఇప్పటికే ఈ విషయం హనీప్రీత్ కు చెప్పానన్నారు. హనీప్రీత్ ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ మంగళవారం తిరస్కరణకు గురైన సంగతి తెలిసిందే.

Honeypreet Insan wants to surrender, but 'conditions' apply, say sources close to Dera chief's aide

పోలీసుల ముందు లొంగిపోవడమే మంచిదంటూ కోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలోనే హనీప్రీత్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది. అత్యాచారం కేసులో డేరాబాబా గుర్మీత్ సింగ్ దోషిగా తేలిన ఆగస్టు 25న పంచకులలో పెద్దఎత్తున అల్లర్లు చెలరేగిన సంగతి తెలిసిందే.

దాదాపు 40 మందికి పైగా ప్రాణాలను బలితీసుకున్న ఈ అల్లర్లలో హనీప్రీత్ ప్రధాన నిందిరాలిగా ఉంది. హనీప్రీత్‌ను మోస్ట్ వాంటెడ్ నిందితురాలిగా పేర్కొన్న పోలీసులు.. ఆమెను అరెస్టు చేసేందుకు తీవ్రంగా గాలిస్తున్నారు.

English summary
Honeypreet Insan, the "adopted daughter" of the now jailed Dera Sacha Sauda chief Gurmeet Ram Rahim Singh wants to surrender but only after certain conditions are met, according to several media reports. Honeypreet is likely to surrender before the Punjab and Haryana High Court on Thursday. "I told the person I was talking to on the phone to surrender herself," Honeypreet's lawyer Pradeep Kumar Arya told.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X