వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాస్టర్ మైండ్ ఆమెది.. అమలు జరిపింది వాళ్ళిద్దరు! సిర్సా అల్లర్ల కోసం రూ.1.25 కోట్ల ఖర్చు?

పంచకుల సీబీఐ కోర్టు తీర్పు తీరువాత.. అల్లర్లు, హింసాత్మక ఘటనల కోసం హనీప్రీత్‌ ఇన్సాన్‌ రూ.1.25 కోట్లు ఖర్చు చేసినట్లు సిట్‌ అధికారులు చెబుతున్నారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

పంచకుల : డేరా సచ్చాసౌధా మాజీ అధిపతి, రేప్‌ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న గుర్మీత్‌ రామ్ రహీమ్ సింగ్ పై తీర్పు తరువాత సిర్సాలో జరిగిన అల్లర్ల వెనక ఉన్న మాస్టర్ మైండ్ ఆయన దత్తపుత్రిక హనీప్రీత్‌ ఇన్సాన్‌ అని తెలుస్తోంది.

పంచకుల సీబీఐ కోర్టు తీర్పు తీరువాత.. అల్లర్లు, హింసాత్మక ఘటనల కోసం హనీప్రీత్‌ ఇన్సాన్‌ రూ.1.25 కోట్లు ఖర్చు చేసినట్లు సిట్‌ అధికారులు చెబుతున్నారు. ఈ అల్లర్లకు సంబంధించిన కీలక వ్యక్తులు ఆదిత్య ఇన్సాన్‌, పవన్‌ ఇన్సాన్‌ల కోసం కూడా
పోలీసులు గాలిస్తున్నారు.

Honeypreet paid Rs 1.25 crore to spark riot in Panchkula, say cops

గుర్మీత్‌ వ్యవహారంపై ఇన్వెస్టిగేషన్‌ చేస్తున్న సిట్‌ అధికారులు.. తాజాగా గుర్మీత్‌ వ్యక్తిగత సహాయకుడు రాకేష్‌ కుమార్‌ని విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విచారణలోనే పలు విషయాలు వెలుగు చూశాయని సీట్‌ అధికారి ఏసీపీ ముఖేష్‌ మల్హోత్రా తెలిపారు.

గుర్మీత్‌పై తీర్పు సమయంలో ఆయనతో పాటు దత్తపుత్రిక హనీప్రీత్‌, వ్యక్తిగత సహాయకుడు రాకేష్‌ కుమార్‌ వెంట ఉన్నారు. తీర్పు వెలువడిన వెంటనే అల్లర్లకు వారు పథకం రచించారని, ఇందుకు రూ.1.25 కోట్లు వెచ్చించారని సిట్‌ అధికారులు ప్రకటించారు. ఇదే విషయాన్ని పంచకుల కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ ఏఎస్‌ చావ్లా సైతం ధ్రువీకరించారు.

గుర్మీత్‌ అరెస్ట్ తరువాత జరిగిన అల్లర్లకు సంబంధించి ఇప్పటికే సిట్‌ అధికారులు రాకేష్‌ కుమార్‌, హనీప్రీత్‌లను విచారిస్తున్నారు. ఈ అల్లర్లకు సంబంధించిన కీలక వ్యక్తులు ఆదిత్య ఇన్సాన్‌, పవన్‌ ఇన్సాన్‌ల కోసం కూడా గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
హనీప్రీత్‌, ఆమె భర్త ఇక్బాల్‌ సింగ్‌, సుఖ్‌దీప్‌లు డేరా కోర్‌ కమిటీ సభ్యులని సిట్‌ అధికారులు చెబుతున్నారు. ఇందులో సుఖ్‌దీప్‌.. డేరా అనుచరులకు ఆయుధాలను ఉపయోగించడంలో శిక్షణ ఇచ్చేవాడని పోలీసులు తెలిపారు.

మరోవైపు డేరా ప్రధానకార్యాలయం నుంచి స్వాధీనం చేసుకున్న కంప్యూటర్‌ హార్డ్‌ డిస్క్‌లను ఐటీ విభాగం విశ్లేషిస్తోంది. ఆ హార్డ్‌ డిస్క్‌ల్లోని విషయాలు బయటకు వస్తే.. మరింత సమాచారం తెలుస్తుందని సిట్‌ అధికారులు పేర్కొంటున్నారు.

English summary
Honeypreet Insan allegedly gave Rs 1.25 crore to Dera Sacha Sauda's Panchkula branch head, Chamkaur Singh, a couple of days ahead of dera head Gurmeet Ram Rahim Singh's conviction in rape cases on August 25. This was revealed to cops by Rakesh Kumar, personal assistant-cum-driver of Gurmeet, during interrogation. Police officials believe the money was used to pay supporters to spark a riot in Panchkula in the event of Gurmeet being convicted of rape by the CBI court. Rakesh Kumar is currently in the custody of the special investigation team (SIT) headed by ACP Mukesh Malhotra. As many as 36 people, all dera folowers, were killed in Panchkula after police opened fire to quell the rioting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X