వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పంచ్‌కుల అల్లర్ల కేసు: డేరా శిష్యురాలు హనీప్రీత్‌ సింగ్‌కు బెయిల్ మంజూరు..

|
Google Oneindia TeluguNews

డేరా సచ్చా సౌద అధినేత గుర్మీత్ రామ్ రహీం ప్రధాన శిష్యురాలు హనీప్రీత్ సింగ్‌కు బెయిల్ మంజూరైంది. ఆమెపై మోపిన దేశద్రోహం కేసు కొట్టివేసిన నాలుగురోజుల తర్వాత బెయిల్ లభించడం విశేషం. ఆశ్రమంలోని ఇద్దరు మైనర్లపై గుర్మీత్ రామ్ రహీం లైంగికదాడి చేశాడని అభియోగాలు ఎదుర్కొన్నారు. ఈ కేసులో నేరాభియోగం రుజువు కావడంతో.. పంచ్‌కులా కోర్టు 2017లో తీర్పు ఇచ్చిన తర్వాత హనీప్రీత్ అండ్ కో అల్లర్లకు పాల్పడ్డారు. హనీప్రీత్ సింగ్ ప్రోద్బలంతోనే అల్లర్లు జరిగాయని పోలీసులు అభియోగాలు మోపారు.

పంచ్‌కులా అల్లర్లకు సంబంధించి 2017 అక్టోబర్ నుంచి అంబాలా సెంట్రల్ జైలులో హనిప్రీతి సింగ్ జ్యుడిషీయల్ కస్టడీలో ఉన్నారు. ఈ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలని హర్యానా కోర్టులో హనిప్రీత్ సింగ్ బెయిల్ పిటిషన్ వేశారు. వాదనలు విన్న మేజిస్ట్రేట్ రోహిత్ హనీప్రీత్‌కు బెయిల్ మంజూరు చేస్తున్నట్టు పేర్కొన్నారు. పంచ్‌కులలో అల్లర్లకు సంబంధించి దేశద్రోహ కేసు కొట్టివేసిన నాలుగురోజలు తర్వాత బెయిల్ లభించడం విశేషం.

Honeypreet Singh gets bail in Panchkula riot case

మైనర్లపై లైంగికదాడికి సంబంధించి గుర్మీత్ రామ్ రహీం శిక్ష ఖరారైన వెంటనే పంచ్‌కులాలో హనీప్రీత్ అండ్ టీం బీభత్సం సృష్టించారు. ఈ రావణ కాష్టంతో 30 మంది చనిపోయారు. 200 మంది గాయపడ్డ సంగతి తెలిసింది. ఈ కేసులో హనీప్రీతితోపాటు 41 మందిపై అభియోగాలు మోపారు. వీరితోపాటు మరో ఐదుగురు కూడా ఉన్నారు. వారిపై మోపబడిన అభియోగాలను క్రమంగా వెనక్కి తీసుకున్నారు. దీంతో ఇప్పటికే కొందరు బెయిల్‌పై విడుదలయ్యారు. తాజాగా హనీప్రీతి‌కి కూడా బెయిల్ లభించింది.

English summary
Honeypreet Singh of Dera Sacha Sauda has got bail in the Panchkula riot case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X