వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పక్కా ప్లాన్‌తో హనీప్రీత్‌లా నటింపచేసి.., పరారిలో 17 సిమ్‌లు ఉపయోగించిన దత్తపుత్రిక

డేరా బాబాతో సంబంధం, ఆయన అరెస్ట్ అనంతరం అల్లర్ల పాత్రపై విచారించేందుకు హనీప్రీత్‌ను పోలీసులు గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లారని తెలుస్తోంది.

|
Google Oneindia TeluguNews

చండీగఢ్: డేరా బాబాతో సంబంధం, ఆయన అరెస్ట్ అనంతరం అల్లర్ల పాత్రపై విచారించేందుకు హనీప్రీత్‌ను పోలీసులు గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లారని తెలుస్తోంది.

చదవండి: 'హనీప్రీత్ ఓ మంచి కోడలు కానీ, రాసలీల తర్వాతే ఇలా'

పోలీసుల ప్రశ్నలకు ఆమె సమాధానం చెప్పడం లేదు. విచారణకు ఆమె ఏమాత్రం సహకరించడం లేదని చెబుతున్నారు. పోలీసులను ఆమె మిస్ లీడ్ చేసే ప్రయత్నాలు చేస్తోంది.

మాట మార్చుతుండటంతో అనుగుణంగా ప్రశ్నలు

మాట మార్చుతుండటంతో అనుగుణంగా ప్రశ్నలు

ఆమె నుంచి అన్ని విషయాలను రాబట్టేందుకు పోలీసులు ఆమెను గుర్తు తెలియని ప్రాంతానికి విచారణ కోసం తీసుకెళ్లారని ప్రచారం సాగుతోంది. ఆమెను ప్రశ్నించేందుకు 300 ప్రశ్నలు సిద్ధం చేశారు. ఆమె పదేపదే తన స్టేట్‌మెంట్లను మార్చుతుండటంతో వారు అందుకు అనుగుణంగా ప్రశ్నలు తయారు చేశారు.

గుట్టుచప్పుడు కాకుండా మరో ప్రాంతానికి

గుట్టుచప్పుడు కాకుండా మరో ప్రాంతానికి

ఆమెను గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లేందుకు పోలీసులు కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించారని తెలుస్తోంది. ఆమెను తీసుకు వెళ్లేందుకు డమ్మీ పోలీసులను వారిలా బయటకు పంపించి, ఆ తర్వాత వీరిని గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లారని అంటున్నారు.

అల్లర్ల కోసం రూ.1.25 కోట్లు

అల్లర్ల కోసం రూ.1.25 కోట్లు

కాగా, డేరా బాబా గుర్మీత్‌ను న్యాయస్థానం దోషిగా తేల్చిన సమయంలో చోటుచేసుకున్న అల్లర్లకు ఆయన దత్తపుత్రిక హనీప్రీత్‌ కారణమని పోలీసులు తేల్చారు. అల్లర్ల కోసం హనీప్రీత్‌ రూ.1.25కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు.

మాస్టర్ మైండ్ హనీప్రీత్

మాస్టర్ మైండ్ హనీప్రీత్

ఆగస్టు 25న హర్యానాలోని పంచుకుల సీబీఐ కోర్టు గుర్మీత్‌ను దోషిగా తేల్చింది. విచారణ నేపథ్యంలో అప్పటికే పంచుకులకు భారీగా చేరుకున్న గుర్మీత్‌ అనుచరులు, భక్తులు తీర్పు వెలువడిన అనంతరం పెద్దఎత్తున అల్లర్లకు పాల్పడ్డారు. ఈ హింసాత్మక ఘటనల్లో 30 మందికిపైగా మృతి చెందారు. అయితే ఈ అల్లర్లకు మాస్టర్ మైండ్‌ హనీప్రీతేనని పోలీసులు తెలిపారు.

డ్రైవర్ విచారణలో వెల్లడి

డ్రైవర్ విచారణలో వెల్లడి

కస్టడీలో ఉన్న గుర్మీత్‌ వ్యక్తిగత సిబ్బంది, డ్రైవర్‌ రాకేశ్‌ కుమార్‌ను విచారించగా ఈ విషయాలను వెల్లడించినట్లు చెప్పారు. కోర్టు తీర్పుకు రెండు రోజుల ముందు పంచకుల డేరా బ్రాంచ్‌ హెడ్‌కు హనీప్రీత్‌ రూ.1.25కోట్లు ఇచ్చినట్లు విచారణలో తెలిసిందన్నారు. దీనికి సంబంధించిన ఆన్‌లైన్‌ నగదు బదిలీ వివరాలు కూడా ఉన్నట్లు వెల్లడించారు.

 17 సిమ్‌లు ఉపయోగించిన హనీప్రీత్

17 సిమ్‌లు ఉపయోగించిన హనీప్రీత్

డేరా బాబా అరెస్టు అనంతరం 38 రోజులు అజ్ఞాతంలో ఉన్న హనీప్రీత్ అన్ని రోజుల్లో 17 సిమ్‌లు ఉపయోగించిందని తేలింది.

English summary
The interrogation of Honeypreet Insan has revealed that while she was hiding, she had changed her SIM card several times. The police are also looking into charges of alleged money laundering and are likely to slap the provisions of FEMA against her.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X