వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వీరసావర్కర్‌తో పాటు గాడ్సేకు కూడ భారతరత్న ఇవ్వండి : ఓవైసీ

|
Google Oneindia TeluguNews

వీరసావర్కర్‌కు భారతరత్న తీసుకువస్తామన్న బీజేపీ వ్యాఖ్యలపై దుమారం రేగుతున్న నేపథ్యంలోనే బీజేపీ చేసిన వ్యాఖ్యలను ఎమ్‌ఐఎమ్ చీఫ్ అసదుద్దిన్ ఓవైసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వీరసావర్కర్‌కు బారతరత్న ఇవ్వాలనుకున్నప్పుడు గాంధీని చంపిన నాథూరాం గాడ్సేకు కూ భారత రత్న ఇవ్వండని ఆయన ఎద్దెవా చేశారు.

స్వాతంత్రపోరాటంలో ద్విజాతీ సిద్దాంతాన్ని మొదట ప్రతిపాదించింది వీరసావర్కార్ అని చెప్పిన ఓవైసీ దాన్ని తర్వాత జీన్నా ఫాలో అయ్యాడని చెప్పారు. బీజేపీ అనుకుంటే గాడ్సేకు కూడ భారతరత్న ఇవ్వచ్చోని ఆయన ఫైర్ అయ్యారు. హిందు మహాసభగాని, ముస్లిం లీగ్ గానీ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గోనలేదని తెలిపిన ఆయన హిందుత్వ సిద్దాంతాలను రచించిన వీరసావర్కార్‌కు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. భారతరత్న అనేది సిద్దాంతాలు రచించినందుకు ఇచ్చేది కాదని ఆయన హితవు పలికారు.

honour should be conferred upon Nathuram Godse as well Veer Savarkar : Asadduddin Owaisi

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ముంబైలో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా పార్టీ ఎన్నికల ప్రణాళికను విడుదల చేసిన సంధర్భంగా తిరిగి అధికారంలోకి వస్తే.. హిందూత్వ సిద్ధాంత రూపకర్త, స్వాతంత్ర్య సమరయోధుడు వీరసావర్కర్‌కు దేశ అత్యున్నత పౌరపురస్కారం భారతరత్న కోసం ప్రయత్నిస్తామని భారతీయ జనతాపార్టీ హామీ ఇచ్చింది. సావర్కర్‌తోపాటు మహాత్మా ఫూలే, సావిత్రిభాయ్ ఫూలేకు భారతరత్న కోసం కేంద్రానికి సిఫారసు చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది.

English summary
AIMIM chief Asadduddin Owaisi hit back at the saffron party suggesting that the honour should be conferred upon Nathuram Godse as well Veer Savarkar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X