వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దుష్యంత్ కే పట్టం: హుడా కుమారుడికి డిప్యూటీ: హర్యానాలో కాంగ్రెస్-జేజేపీ సంకీర్ణ సర్కార్

|
Google Oneindia TeluguNews

చండీగఢ్: హర్యానా రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఊహించినట్టే.. కింగ్ మేకర్ గా ఆవిర్భవించిన జన్ నాయక్ జనతా పార్టీ (జేజేపీ) అధినేత దుష్యంత్ చౌతాలా అందలం ఎక్కడం ఖాయమైంది. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో జేజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఇక లాంఛన ప్రాయమే. దుష్యంత్ చౌతాలా సారథ్యంలోని జేజేపీతో పొత్తు కలిసి హర్యానాలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలా? వద్దా అనే విషయంపై కాంగ్రెస్ అధిష్ఠానం స్పష్టత ఇచ్చింది. దుష్యంత్ చౌతాలాకు ముఖ్యమంత్రి పదవిని వదులుకోవడానికి సిద్ధపడింది.

కాంగ్రెస్-జేజేపీ సంకీర్ణ కూటమి సారథ్యంలో..

కాంగ్రెస్-జేజేపీ సంకీర్ణ కూటమి సారథ్యంలో..


ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపీందర్ సింగ్ హుడా వెల్లడించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఆయన దుష్యంత్ చౌతాలాను ఆహ్వానించారు.. అధికారికంగా. కాంగ్రెస్-జేజేపీల సారథ్యంలో హర్యానాలో సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు కసరత్తు సాగుతోంది. మంత్రివర్గ కూర్పు ఎలా ఉండాలనే అంశంపై అటు కాంగ్రెస్ గానీ, ఇటు జేజేపీ గానీ ఇంకా ఎలాంటి నిర్ణయానికీ రాలేదు. అయినప్పటికీ- ఉప ముఖ్యమంత్రి పదవిని కాంగ్రెస్ కు కేటాయించాలనే షరతును విధించినట్లు తెలుస్తోంది.

కన్నడంలో అనర్గళంగా వైసీపీ ఎంపీ: ప్రశంసించిన సదానంద గౌడ: ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి సమక్షంలోకన్నడంలో అనర్గళంగా వైసీపీ ఎంపీ: ప్రశంసించిన సదానంద గౌడ: ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి సమక్షంలో

దీపేందర్ సింగ్ హుడాకు డిప్యూటీ..

దీపేందర్ సింగ్ హుడాకు డిప్యూటీ..


భూపీందర్ సింగ్ హుడా కుమారుడు దీపేందర్ సింగ్ హుడాకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చే అవకాశాలు లేకపోలేదు. రెండు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన భూపీందర్ సింగ్ హుడా.. ఈ సారి రాజకీయాలకు పూర్తిగా కొత్త అయిన దుష్యంత్ చౌతాలా చేతి కింద పని చేయడానికి, ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించడానికి ఎంత మాత్రమూ సుముఖంగా లేరని తెలుస్తోంది. తనకు బదులుగా కుమారుడు దీపేందర్ సింగ్ హుడాకు ఉప ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టాలని ఆయన భావిస్తున్నారు. దీనికి అనుగుణంగానే ప్రస్తుతం హర్యానా రాజకీయాలు సాగుతున్నాయి.

హుడాకు పూర్తి స్వేచ్ఛనిచ్చిన సోనియా..

హుడాకు పూర్తి స్వేచ్ఛనిచ్చిన సోనియా..


హర్యానాలో హంగ్ అసెంబ్లీ ఏర్పడిన పరిస్థితుల్లో అధికారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు. భారతీయ జనతాపార్టీ అందలం ఎక్కకుండా చేయడానికి ఎలాంటి చర్యలకైనా దిగాలని తీర్మానించుకుంది. హర్యానా రాజకీయాల్లో ఎలాంటి జోక్యం చేసుకోలేదు. రాష్ట్ర రాజకీయ నాయకులకే బాధ్యతలను అప్పగించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. తాము దానికి అంగీకరిస్తామని పార్టీ అధినేత్రి సోనియా గాంధీ స్పష్టం చేశారు. కొద్దిసేపటి కిందటే ఆమె భూపీందర్ సింగ్ హుడాతో ఫోనులో మాట్లాడారు. దీనితో- ఇక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ ఆయన దుష్యంత్ చౌతాలాను ఆహ్వానించారు.

English summary
Haryana Congress Party senior leader and Former Chief Minister Bhupinder Singh Hooda invites Jan Nayak Janata Party (JJP) Chief Dushyant Chautala to form govt in Haryana. All India Congress Committee Interim President Sonia Gandhi spoke over the Phone with BS Huda.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X