వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనా మద్దతుతో మళ్లీ ఆర్టికల్ 370 - జమ్మూకాశ్మీర్ నేత ఫరూక్ అబ్దుల్లా మరో సంచలనం

|
Google Oneindia TeluguNews

నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు, మాజీ కేంద్ర మంత్రి, జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్‌ అబ్దుల్లా మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. తమను ద్వితీయశ్రేణి పౌరులుగా చూసే భారత్ లో ఉండేకంటే, చైనీయులుగా జీవించాలని కాశ్మీరీలు కోరుకుంటున్నారంటూ గతంలో బాంబు పేల్చిన ఆయన... తాజాగా చైనా మద్దతుతో జమ్మూకాశ్మీర్ లో ఆర్టికల్ 370 పునరుద్ధరణ జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

భార్యాపిల్లల కళ్లముందే టీఆర్ఎస్ నేతను పొడిచి, కాల్చిచంపిన మావోయిస్టులు - ములుగు జిల్లాలో ఘాతుకంభార్యాపిల్లల కళ్లముందే టీఆర్ఎస్ నేతను పొడిచి, కాల్చిచంపిన మావోయిస్టులు - ములుగు జిల్లాలో ఘాతుకం

ఏడు నెలల పాటు గృహనిర్భందం తరువాత గత నెలలో విడుదలైన ఫరూక్ అబ్దుల్లా పలు జాతీయ వార్తా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఆదివారం 'ఇండియా టుడే'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అబ్దుల్లా మాట్లాడుతూ.. ఆర్టికల్‌ 370 రద్దును కశ్మీరీలుగానీ, చైనాగానీ ఏనాడూ ఆమోదించలేదని, గత ఒప్పందాలకు విరుద్ధంగా కేంద్రం ఆర్టికల్ 370ని తొలగించింది కాబట్టే, దానికి వ్యతిరేకంగా సరిహద్దులో చైనా చర్యలకు దిగుతోందని చెప్పారు. అంతటితో ఆగకుండా.

 Hope Article 370 will be restored in J&K with Chinas support: Farooq Abdullah
.

చైనా మద్దతుతో జమ్మూకాశ్మీర్ లో మళ్లీ ఆర్టికల్ 370 పునరుద్ధరణ జరుగుతుందన్న నమ్మకం ఉందని కూడా అబ్దుల్లా వ్యాఖ్యానించారు. నిజానికి భారత్ వ్యవహారంలోకి చైనాను ఆహ్వానించింది ప్రధాని మోదీనే అని, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ను ఇండియాకు పిలిచి, ఊయల ఊగింది, కలిసి భోజనం చేసింది మోదీనే అని అబ్దుల్లా గుర్తుచేశారు.

చంద్రబాబు ఆయువుపట్టుపై దాడి - జస్టిస్ ఎన్వీ రమణపై జగన్ సంచలనం -ప్రధాని మోదీని కలిసిన రోజేచంద్రబాబు ఆయువుపట్టుపై దాడి - జస్టిస్ ఎన్వీ రమణపై జగన్ సంచలనం -ప్రధాని మోదీని కలిసిన రోజే

Recommended Video

#HBDAmitabhBachchan : మీరే మా గురువు.. బిగ్ బి కు చిరు, ప్రభాస్, మహేష్ స్పెషల్ బర్త్ డే విషెస్!

''జమ్మూకాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దుపై కేంద్రం అన్యాయంగా వ్యవహరించింది. దానిపై పార్లమెంటులో మాట్లాడేందుకు నాకు అవకాశం ఇవ్వలేదు. ప్రస్తుతం కాశ్మీరీలు తమను తాము భారతీయులుగాకంటే, చైనీయులుగా ఉండటానికే ఇష్టపడుతున్నారని అనిపిస్తోంది. చైనా మద్దతుతో మళ్లీ ఆర్టికల్ 370 ఉనికిలోకి వస్తుందన్న నమ్మకం ఉంది'' అని అబ్దుల్లా పేర్కొన్నారు.

English summary
Former Jammu and Kashmir Chief Minister Farooq Abdullah on Sunday held the Centre's decision to abrogate Article 370 responsible for the Chinese aggression at the Line of Actual Control (LAC) in Ladakh. Speaking exclusively to India Today TV, Farooq Abdullah said that China "never accepted" the Abrogation of Article 370, and hoped that it will be restored with China's support.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X