వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పౌరులకే హక్కులు.. గోవులకు కాదు... గో సంరక్షణపై మోడీ కామెంట్లపై అసదుద్దీన్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : ప్రధాని మోడీపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఫైరయ్యారు. గో సంరక్షణ పేరుతో మోడీ చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మోడీకి రాజ్యాంగం తెలుసు అనుకుంటా అని సెటైర్లు విసిరారు. మధురలో జాతీయ జంతు వ్యాధి నివారణ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా మోడీ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మోడీ వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు.

మోహన్ భగవత్ కాన్వాయ్ కారు ఢీకొని ఆరేళ్ల బాలుడు మృతి, తాత పరిస్థితి విషమంమోహన్ భగవత్ కాన్వాయ్ కారు ఢీకొని ఆరేళ్ల బాలుడు మృతి, తాత పరిస్థితి విషమం

మాటలు-మంటలు

గోవు పవిత్రమైన జంతువు అంటున్నారు.. సరే... . సాధారణ పౌరులకు జాతీయ పౌరసత్వం ఉంది కదా .. ఈ విషయం మోడీకి తెలుసు కదా అని సెటైర్లు వేశారు. గోవు హిందు సోదరుల పవిత్రకు చిహ్నామని .. అంగీకరించారు. కానీ పౌరులతో సమానం కాదు కదా అనే ఉద్దేశంతో కామెంట్ చేశారు. మధురలో జరిగిన కార్యక్రమంలో మోడీ మాట్లాడుతూ గోవు, ఓం అని కొందరు హేళన చేస్తున్నారని విమర్శించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు.

ఇదీ విషయం

ఇదీ విషయం

గో సంరక్షణ కోసం చర్యలు తీసుకుంటుంటే విపక్షాలు విమర్శించడాన్ని ప్రధాని నరేంద్ర మోడీ తప్పుపట్టారు. విపక్షాల ఆరోపణల్లో పసలేదని విమర్శించారు. గో సంరక్షణ కోసం పాటుపడుతుంటే దేశాన్ని వెనక్కి తీసుకెళ్తున్నారని కొందరు చేస్తున్న విమర్శలను తప్పుపట్టారు. ఇది సరికాదని వారికి హితవు పలికారు. గో సంరక్షణ పేరుతో దేశం తిరోగమిస్తోందని విపక్షాలు పదే పదే ఆరోపణలు గుప్పిస్తున్నాయి. గో సంరక్షణ అని చెప్తూ దేశాన్ని 16వ శతాబ్దంలోకి తీసుకెళ్తున్నారని విమర్శిస్తున్నారు. అలాంటి వారి వల్లే దేశం వెనక్కి నెట్టవేయబడుతుందని మోడీ పేర్కొన్నారు. తమ స్వార్థ సంకుచిత రాజకీయాల కోసం విమర్శలు చేయడం సరికాదని మండిపడ్డారు.

పశువుల కోసం

పశువుల కోసం

పశు సంరక్షణ కోసం జాతీయ జంతు వ్యాధి నివారణ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. ముఖ్యంగా జంతువుల్లో కాలు, నోటిలో బ్యాక్టీరియాతో రోగాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా బ్రూసెల్లొసిస్ బ్యాక్టీరియా బారిన పడుతున్నారు. దీంతో గేదెలు, గొర్రె, మేక, పందులపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఈ రోగాల బారి నుంచి విముక్తి చేసేందుకు 500 మిలియన్ల వ్యాక్సిన్లు పంపించినట్టు గుర్తుచేశారు. అయితే దూడల్లో రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నందున బ్యాక్టిరీయా సోకి చనిపోతున్నాయని తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. బ్యాక్టీరియాను 2025 నాటికి నియంత్రణలోకి తీసుకొస్తామని .. అదీ 2030 నాటికి పూర్తిగా నిర్మూలిస్తామని ప్రధాని మోడీ స్పష్టంచేశారు.

English summary
all India Majlis-e-Ittehadul Muslimeen (AIMIM) chief Asaduddin Owaisi on Wednesday said that while cow is a sacred animal in India, the Constitution of the country does give its citizens a right to life and equality. Asaduddin Owaisi said this in response to PM Modi's remark that critics of the Centre saying those slamming the government over its cow policies are only destroying the country. Asaduddin Owaisi said, "Cow is a sacred animal for our Hindu brothers but in the Constitution, right to life and equality has been given to humans, I hope PM Modi will keep it in mind."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X