వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'శ్రీదేవిది ఆత్మహత్య...? కాకూడదు', అంత పిరికి కాదు: ట్విస్ట్.. రీ-ఇన్వెస్టిగేషన్

|
Google Oneindia TeluguNews

దుబాయ్: నటి శ్రీదేవి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె మృతి ప్రమాదమేనని దుబాయ్ పోలీసులు తేల్చి చెప్పారు. కానీ అంతకుముందు బంధువులు మాత్రం కార్డియాక్ అరెస్ట్ అన్నారు. ఫోరెన్సిక్ నివేదికలో ఎక్కడా ఈ ప్రస్తావన లేదు.

దీంతో శ్రీదేవి మృతిపై ఎన్నో డౌట్స్ వస్తున్నాయని అంటున్నారు. ప్రముఖ రచయిత తస్లీమా నస్రీన్ స్పందిస్తూ... ఇది సూసైడ్ కావొద్దని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఆమె వ్యాఖ్యలపై కొందరు భగ్గుమన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు సరికాదని కొందరు నెటిజన్లు పేర్కొన్నారు.

తెలియని మిస్టరీ దాగి ఉందా

తెలియని మిస్టరీ దాగి ఉందా

శ్రీదేవి మృతిపై ఫోరెన్సిక్ నిపుణులు చెబుతున్నట్లుగా నిజంగా శ్రీదేవి ప్రమాదవశాత్తూనే చనిపోయారా? లేక ఆమె ఆత్మహత్య చేసుకున్నారా? బాత్‌టబ్‌లో ప్రమాదవశాత్తు పడిపోయినట్లు ఫోరెన్సిక్ అధికారులు ఎలా నిర్ధారిస్తారని.. పబ్లిక్ ప్రాసిక్యూషన్ అడుగుతున్న ప్రశ్నలను చూస్తుంటే ఈ డెత్ వెనుక తెలియని ఏదో మిస్టరీ ఉందనేది అర్ధం అవుతోందని వార్తలు వస్తున్నాయి.

మున్ముందు ఏం తేలుతాయి

మున్ముందు ఏం తేలుతాయి

అయితే, ఇప్పటికే దుబాయ్ పోలీసులు తేల్చి చెప్పారు. శ్రీదేవి కేవలం ప్రమాదవశాత్తు చనిపోయారని చెప్పారు. అయితే ఇంకా విచారణ జరుగుతోందని తెలిపారు. ఈ నేపథ్యంలో మున్ముందు విచారణలో ఏం తేలుతాయనేది ఆసక్తికరంగా మారింది.

ఆమెకు ఆత్మహత్య చేసుకునేంత సీన్ లేదు

తస్లీమా అనుమానించినట్లు శ్రీదేవిది ఒకవేళ ఆత్మహత్య అయితే ఆమెకి ఆత్మహత్య చేసుకోవాల్సినంత కష్టం ఏమొచ్చింది, కాబట్టి అది ట్రాష్ అంటున్నారు. ఇద్దరు కూతుళ్లను వదిలి చనిపోవాలని ఎందుకు అనుకుంటుందని అంటున్నారు. తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న శ్రీదేవి అంత పిరికిగా ఎందుకు ఆలోచిస్తుందని చెబుతున్నారు.

 తస్లీమా నస్రీన్ ట్వీట్

తస్లీమా నస్రీన్ ట్వీట్

శ్రీదేవి పొరపాటున బాత్ టబ్‌లో పడిందన్న వార్తలపై కూడా తస్లీమా నస్రీన్ స్పందించారు. ఆరోగ్యంగా ఉన్న ఓ మహిళ ప్రమాకరంగా బాత్ టబ్‌లో ఎలా పడుతుందన్నారు.

 మద్యం తాగే అలవాటు లేదు

మద్యం తాగే అలవాటు లేదు

కాగా, శ్రీదేవికి మద్యం తాగే అలవాటు లేదని అమర్ సింగ్ సంచలన విషయం వెల్లడించారు. అయితే అప్పుడప్పుడు తనలాగే వైన్ తీసుకుంటుందని తెలిపారు. ప్రజాజీవితంలో చాలామంది వైన్ తీసుకుంటారన్నారు. శ్రీదేవి మృతదేహాన్ని భారత్ తరలించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

 రీ ఇన్వెస్టిగేషన్

రీ ఇన్వెస్టిగేషన్

శ్రీదేవి కేసు విచారణ కొనసాగుతుందని పోలీసులు చెప్పారు. మరోవైపు కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు దుబాయ్ పోలీసులు ట్రాన్సుఫర్ చేశారు. దీనిని వారు రీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. బాత్ టబ్‌లో ప్రమాదవశాత్తు పడిపోయినట్లు ఫోరెన్సిక్ అధికారులు ఎలా నిర్ధారిస్తారని పబ్లిక్ ప్రాసిక్యూషన్ అభ్యంతరం వ్యక్తం చేసిందని తెలుస్తోంది. కేసు విచారణ పూర్తయ్యే వరకు బోనీకపూర్‌ను దుబాయ్‌లోనే ఉండాలని సూచించిందని తెలుస్తోంది.

English summary
Renowned Bangladeshi author Taslima Nasreen tweeted on Monday expressing doubts regarding the cause of Sridevi's death. Although it has been confirmed that Sridevi died due to cardiac arrest, Taslima expressed concern if she committed suicide or someone murdered her.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X