వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీవీవీ ట్విస్ట్‌: మరో ఇద్దరు ఎమ్మెల్యేలు జంప్‌, చైన్నైకి గవర్నర్‌.. నిర్ణయంపై ఉత్కంఠ

ప్రభుత్వం మైనార్టీలో పడిపోయిన స్థితిలో తమిళనాడు తాత్కాలిక గవర్నర్‌ విద్యాసాగర్‌రావు శనివారం సాయంత్రం తిరిగి చెన్నైకి చేరుకున్నారు. మరి ఎడప్పాడి ప్రభుత్వంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ అందరిలో.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడులో అధికార పార్టీ రాజకీయాలు ఊహించని విధంగా మారిపోతున్నాయి. పళనిస్వామి ప్రభుత్వాన్ని కూల్చేసేందుకు కంకణం కట్టుకున్న టీవీవీ దినకరన్‌ మళ్లీ ట్విస్ట్‌ ఇచ్చారు. తాజాగా మరో ఇద్దరు ఎమ్మెల్యేలను తనవైపునకు లాగేసుకున్నారు.

ఎమ్మెల్యేలు రత్నసభాపతి, కలైసెల్వన్‌లు శనివారం టీవీవీ శిబిరంలో చేరిపోవడంతో వైరివర్గం బలం 21కి పెరిగింది. ఇప్పటికి వచ్చినవాళ్లే కాకుండా.. రెండు రోజుల్లో 8 మంది మంత్రులు, 60 మంది ఎమ్మెల్యేలు తమవైపునకు రానున్నట్లు శశికళ తమ్ముడు దివాకరన్‌ శనివారం మీడియాకు చెప్పారు.

అనర్హతనూ లెక్కచేయని ఎమ్మెల్యేలు...

శుక్రవారం వరకు దినకరన్‌తో ఉన్న 19 మంది ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి అసెంబ్లీ స్పీకర్‌ ధన్‌పాల్‌ నోటీసులు జారీచేశారు. అయితే స్పీకర్‌ ఇచ్చిన నోటీసులు తమకు అందలేదని, ఒకవేళ అందినా బదులిచ్చేది లేదని దినకరన్‌ వర్గం ఎమ్మెల్యే వెట్రివేల్‌ తేల్చిచెప్పారు. రెండు రోజుల్లోగా గవర్నర్‌ ఏదైనా నిర్ణయం తీసుకోని పక్షంలో రాష్ట్రపతిని కలుస్తామని అదే వర్గానికి చెందిన మరో ఎమ్మెల్యే తంగతమిళ్‌ సెల్వన్‌ చెప్పారు. అసెంబ్లీలో అన్నాడీఎంకేకు 134 మంది ఎమ్మెల్యేలు ఉండగా వీరిలో 21 మంది దినకరన్‌ వైపు ఉన్నారు. దీంతో పళనిస్వామి బలం 122 నుండి 113కి పడిపోయింది. ప్రభుత్వం నిలబడేందుకు మరో నలుగురు ఎమ్మెల్యేలు అవసరం. అన్నాడీఎంకే మద్దతుతో గెలిచిన మిత్రపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ముగ్గురు తాత్కాలికంగా తటస్థ వైఖరి అవలంభిస్తున్నా వారు దినకరన్‌వైపే మొగ్గుచూపుతున్నారు.

చెన్నైకి గవర్నర్‌.. నిర్ణయంపై ఉత్కంఠ...

ప్రభుత్వం మైనార్టీలో పడిపోయిన స్థితిలో ఎలాంటి నిర్ణయం ప్రకటించకుండా ముంబయికి వెళ్లిన తమిళనాడు తాత్కాలిక గవర్నర్‌ విద్యాసాగర్‌రావు శనివారం సాయంత్రం తిరిగి చెన్నైకి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎడప్పాడి ప్రభుత్వంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోననే ఉత్కంఠ అందరిలో నెలకొంది. అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాలని గవర్నర్‌ ఆదేశించిన పక్షంలో పళనిస్వామి ఇరుకునపడక తప్పదు. ఇదిలా ఉండగా, ఉప రాష్ట్రపతి హోదాలో ఎం వెంకయ్యనాయుడు ఆదివారం తొలిసారిగా చెన్నైకి వస్తున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకే గవర్నర్‌ వస్తున్నారని, ఇతరత్రా మరే నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండబోదని కొందరు అంటున్నారు.

English summary
Bolstered by two more MLAs joining him, sidelined AIADMK leader TTV Dinakaran today said his camp was confident that Governor C Vidyasagar Rao will take a "good decision" on representation given by his legislators seeking Chief Minister K Palaniswami's ouster. Asserting that his aim was to safeguard the party, he said the group (of his loyalist MLAs) was hopeful that Mr Rao will "take a good decision." Describing the governor as a "legal expert", Mr Dinakaran told reporters in Chennai that "justice", for which his loyalists had taken up cudgels against the incumbent dispensation led by Mr Palaniswami, "will win". "I will work with them (his loyalist MLAs)," the sidelined AIADMK leader said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X