• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పెన్సిల్ తో పొడిచి ,పలుమార్లు కొరికి బిడ్డపై తల్లి పైశాచికం ..ఆన్ లైన్ క్లాసులో ఆన్సర్ చెప్పనందుకే

|

దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో ఓ తల్లి , తన బిడ్డ పై దాడి చేయడం , ఆగ్రహంలో అత్యంత పాశవికంగా ప్రవర్తించటం అందరినీ షాక్ కు గురి చేసింది. ప్రస్తుతం దేశంలో కరోనా కారణంగా స్కూల్స్ కొనసాగడం లేదు. చాలా వరకు ఆన్లైన్ తరగతుల ద్వారానే విద్యాబోధన సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆన్లైన్ క్లాస్ సందర్భంగా, శ్రద్ధగా పాఠాలు వినకుండా, ఉపాధ్యాయులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడంలో విఫలమైనందుకు ఒక తల్లి తన కుమార్తెను పెన్సిల్ తో పొడిచి పైశాచికంగా ప్రవర్తించింది .

2 కిలోమీటర్లు నడిచి, చేలో మంచె పైకెక్కి.. ఆన్ లైన్ క్లాసులు వింటున్న విద్యార్థినికి అండగా..2 కిలోమీటర్లు నడిచి, చేలో మంచె పైకెక్కి.. ఆన్ లైన్ క్లాసులు వింటున్న విద్యార్థినికి అండగా..

12 ఏళ్ళ కుమార్తెను పెన్సిల్ తో పొడిచిన తల్లి .. ఆన్ లైన్ తరగతులే కారణం

12 ఏళ్ళ కుమార్తెను పెన్సిల్ తో పొడిచిన తల్లి .. ఆన్ లైన్ తరగతులే కారణం

ఆరో తరగతి చదువుతున్న 12 ఏళ్ల కుమార్తె ఆన్లైన్ తరగతులకు హాజరవుతోంది. ఆన్లైన్ క్లాసులో ఉన్న కుమార్తె టీచరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వడంలో విఫలమైంది. దీంతో ఆ తల్లి ఆగ్రహంతో ఊగిపోయింది. విపరీతమైన కోపంలో ఉన్న ఆ తల్లి విచక్షణ జ్ఞానాన్ని మరిచిపోయి పన్నెండేళ్ల బిడ్డపై దారుణంగా దాడి చేసింది . ఆమె వీపు భాగంలో పెన్సిల్ తో పొడిచి, పలుమార్లు ఆ బాలికను నోటితో కొరికింది. దీంతో బాలిక తీవ్ర గాయాలపాలైంది .

తెల్లి చేస్తున్న దారుణం చూసి షాక్ అయిన బాలిక చెల్లి

తెల్లి చేస్తున్న దారుణం చూసి షాక్ అయిన బాలిక చెల్లి

తల్లి చేస్తున్న దారుణాన్ని చూసిన బాలిక చెల్లెలు, చైల్డ్ లైన్ నెంబర్ కు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని వారికి చెప్పింది. దీంతో చైల్డ్ లైన్ నుండి ఇద్దరు ప్రతినిధులు బాలిక ఇంటికి చేరుకుని, అక్కడి పరిస్థితులను పరిశీలించి, తల్లి తో మాట్లాడే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ తల్లి బాలిక చదువుకోకుండా నిర్లక్ష్యంగా ఉండటం తప్పంటూ వారితో వాదించింది. దీంతో సదరు మహిళ పై సాంట్‌క్రూజ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది. తల్లి చేసిన దాడిలో గాయపడిన బాలికను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

స్కూల్స్ లేకపోవటం , పిల్లలు మాట వినకపోవటంతో తల్లిదండ్రులలో మానసిక ఒత్తిడి

స్కూల్స్ లేకపోవటం , పిల్లలు మాట వినకపోవటంతో తల్లిదండ్రులలో మానసిక ఒత్తిడి

స్కూల్స్ లేకపోవడం, పిల్లలు ఇళ్లలోనే ఉంటూ తల్లిదండ్రులు చెప్పిన మాట వినకుండా ఇబ్బంది పెడుతూ ఉండడం, చదువుకోకపోవటం, కరోనా కారణంగా నెలకొన్న ఆర్థిక ఇబ్బందులు వెరసి తల్లిదండ్రులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో చాలామంది తల్లిదండ్రులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతూ ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితిలో ఉన్నారు. స్కూల్స్ లేకుండా, ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే ముందు ముందు చాలా మంది తల్లిదండ్రులు, చెప్పిన మాట వినని పిల్లలతో మనో వ్యాధులకు గురయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది.

  #WATCH : తల్లి ప్రేమ.. దుండగుల నుండి ఒంటి చేత్తో బిడ్డను కాపాడుకున్న తల్లి! || Oneindia Telugu
  విచక్షణ కోల్పోయిన తల్లి మానసిక పరిస్థితికి అద్దం పడుతున్న దారుణం

  విచక్షణ కోల్పోయిన తల్లి మానసిక పరిస్థితికి అద్దం పడుతున్న దారుణం

  ముంబైలో జరిగిన తాజా ఘటన కూడా విచక్షణ కోల్పోయిన తల్లి మానసిక పరిస్థితికి అద్దం పడుతుందని మానసిక వైద్య నిపుణులు అంటున్నారు. గత ఆరునెలల కాలంగా పిల్లలు నిత్యం ఇంట్లోనే ఉండటం , వారు క్రమశిక్షణ లేకుండా ప్రవర్తించటం , 24 గంటలు పిల్లలను తల్లిదండ్రులు కంట్రోల్ చెయ్యలేకపోవటం , వారు చదువుపై కూడా పెద్దగా శ్రద్ధ కనబరచకపోవటం వంటి అనేక కారణాలతో పాటు కుటుంబ పరిస్థితులు మానసిక రుగ్మతకు దారి తీస్తున్నాయని మానసిక నిపుణులు అంటున్నారు .

  English summary
  A woman has been booked for allegedly assaulting her daughter for failing to pay attention during an online class in Mumbai. The Santcruz police station booked the woman for allegedly stabbing her 12-year-old daughter with a pencil after she failed to answer teacher's questions during an online class, a report said.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X