వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్ : 7 నెలల్లో ఏడుసార్లు.. బాలికను అమ్మేసిన వైనం.. మానసిక వికలాంగుడితో బలవంతపు పెళ్లి..

|
Google Oneindia TeluguNews

ఛత్తీస్‌గఢ్‌లో దారుణం వెలుుచూసింది. 18 ఏళ్ల ఓ యువతిని ఆమె దూరపు బంధువులు ఉద్యోగం పేరుతో మోసం చేశారు. డబ్బులకు కక్కుర్తి పడి ఆమెను మరొకరికి అమ్మేశారు. అలా ఏడు నెలల కాలంలో ఆమె ఏడుగురి చేతులు మారింది. ఒక్కొక్కరు తమవద్ద కొన్ని రోజులు ఉంచుకోవడం ఆ తర్వాత అమ్మేయడం చేశారు. చివరకు బలవంతంగా ఓ మానసిక వికలాంగుడితో ఆమె పెళ్లి జరిపించారు. తన జీవితం నాశనమైపోయిందన్న బాధతో తీవ్రంగా కుమిలిపోయిన బాధితురాలు గతేడాది సెప్టెంబర్‌లో ఆత్మహత్యకు పాల్పడింది.

అసలేం జరిగింది...

అసలేం జరిగింది...

పోలీసుల కథనం ప్రకారం... ఛత్తీస్‌గఢ్‌లోని జష్పూర్‌కి చెందిన ఆ యువతి వ్యవసాయంలో తన తండ్రికి చేదోడు వాదోడుగా ఉండేది. మధ్యప్రదేశ్‌లో ఉండే వారి దూరపు బంధువులు పంచమ్ సింగ్ రాయ్,అతని భార్య గతేడాది ఓరోజు జష్పూర్‌కి వచ్చారు. యువతి ఇంటికి వెళ్లిన ఆ దంపతులు... ఊళ్లో వ్యవసాయ పనులేం చేస్తావ్... మాతో వస్తే ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తామని ఆమెకు ఆశజూపారు. తెలిసినవారే కావడంతో ఆ యువతితో పాటు తల్లిదండ్రులు కూడా వారి మాటలను నమ్మేశారు.

7 నెలల్లో ఏడుసార్లు....

7 నెలల్లో ఏడుసార్లు....

అలా ఉద్యోగం పేరుతో ఆ యువతిని మధ్యప్రదేశ్ తీసుకెళ్లిన ఆ దంపతులు అత్యంత దారుణంగా వంచించారు. కేవలం రూ.20వేలకు కక్కుర్తి పడి ఛతార్‌పూర్‌కి చెందిన కల్లు రైక్వార్ అనే వ్యక్తికి ఆమెను అమ్మేశారు. ఆ వ్యక్తి ఆమెను తనవద్ద కొద్దిరోజులు ఉంచుకుని మరొకరికి అమ్మేశాడు. ఇలా మొత్తం ఏడు నెలల కాలంలో ఏడుసార్లు ఆమెను అమ్మేశారు. ఒక్కొక్కరు ఆమెను కొద్దిరోజులు ఉంచుకోవడం... ఆ తర్వాత డబ్బులకు ఇతరులకు అమ్మేయడం చేశారు.

మానసిక వికలాంగుడితో బలవంతపు పెళ్లి...

మానసిక వికలాంగుడితో బలవంతపు పెళ్లి...

చివరిసారిగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని లలిత్‌పూర్‌కి చెందిన సంతోష్ కుష్వాహా అనే వ్యక్తి రూ.70వేలతో ఆ యువతిని కొనుగోలు చేశాడు. ఆపై మానసిక వికలాంగుడైన తన కుమారుడు బబ్లూ కుష్వాహాతో ఆమెకు బలవంతంగా వివాహం జరిపించాడు. తన జీవితం సర్వ నాశనమైపోయిందని భావించిన ఆ బాలిక బయటపడే మార్గం తెలియక తనలో తానే తీవ్రంగా కుమిలిపోయింది. చివరకు గతేడాది సెప్టెంబర్‌లో లలిత్‌పూర్‌లోనే ఆత్మహత్యకు పాల్పడింది.

కొనసాగుతున్న దర్యాప్తు

కొనసాగుతున్న దర్యాప్తు

బాధిత బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఛత్తీస్‌గఢ్,మధ్యప్రదేశ్,ఉత్తరప్రదేశ్‌లకు చెందిన 8 మందిని అరెస్ట్ చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని గిరిజన ప్రాంతాల్లో ఇంకా చాలామంది యువతులు ఇలాగే మోసాలకు గురవుతున్నట్లు అనుమానిస్తున్నారు. యువతులను అక్రమ రవాణా చేసే ముఠాలు పుట్టుకొచ్చినట్లు అనుమానిస్తున్నారు.

English summary
An 18-year-old girl from Chhattisgarh was sold seven times in seven months to people in Madhya Pradesh and Uttar Pradesh last year before she died by suicide in September, the police said. Eight men have been arrested in the case, which is being investigated by the police of three states -- Chhattisgarh, Madhya Pradesh and Uttar Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X