చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మనుషులేనా?: ఏనుగుపైకి మండుతున్న టైరు విసిరి ప్రాణం తీశారు(వీడియో)

|
Google Oneindia TeluguNews

చెన్నై: ఇటీవల కాలంలో కొందరు మనుషులు జంతువుల కన్నా క్రూరంగా ప్రవర్తిస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. మొన్నటికిమొన్న ఓ డాల్ఫిన్‌ను అత్యంత కిరాతకంగా కొట్టి చంపిన ఘటన మరువక ముందే.. తమిళనాడులో ఓ ఏనుగుకు మంట పెట్టి దాని ప్రాణం తీశారు. ఈ దారుణ ఘటన నీలగిరిస్ జిల్లాలోని మాసినగుడిలో చోటు చేసుకుంది.

Recommended Video

#Elephant : Police and forest officials in Kerala investigation On elephant issue
మండుతున్న రబ్బరు టైరును ఏనుగుపైకి విసిరారు..

మండుతున్న రబ్బరు టైరును ఏనుగుపైకి విసిరారు..

అటుగా వచ్చిన ఏనుగును భయపెట్టేందుకు ఓ రెస్టారెంట్ యజమాని, సిబ్బంది మంటలు చూపించారు. ఆ తర్వాత మండుతున్న ఓ రబ్బరు టైరును ఏనుగు పైకి విసిరారు. భారీ మంటలతో ఎగిసిపడుతున్న ఆ టైరు.. ఏనుగు చెవికి తగిలి అక్కడే ఆగిపోయింది. దీంతో ఆ ఏనుగుకు మంటలు తగిలి భిగ్గరగా ఆరుస్తూ అక్కడ్నుంచి వెళ్లిపోయింది.

తీవ్రగాయాలతో కుప్పకూలిపోయిన ఏనుగు

తీవ్రగాయాలతో కుప్పకూలిపోయిన ఏనుగు

సమీపంలోని ఓ డ్యామ్ వద్ద తీవ్ర గాయాలపాలైన ఈ ఏనుగు అక్కడే పడివుంది. గమనించిన స్థానికులు సమాచారం ఇవ్వడంతో అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకుని ఏనుగుకు వైద్యం అందించే ప్రయత్నం చేశారు. వైద్యులు వైద్యం అందించినప్పటికీ.. భారీగా రక్తస్రావం కావడంతో ఏనుగు ప్రాణాలు వదిలింది. 50 ఏళ్ల ఏనుగు ఈ మానవ మృగాల చేతిలో ప్రాణాలు వదిలిందని అటవీశాఖ అధికారులు తెలిపారు. టైరు మంట తగిలి ఏనుగు చర్మం బాగా కాలిపోయిందని, ఆ గాయాలతోనే ఏనుగు మరణించిందని వైద్యులు తేల్చారు.

నిందితులను కఠినంగా శిక్షించాలంటూ..

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. రెస్టారెంట్ యజమాని రేమాండ్‌తోపాటు అతని దగ్గర పనిచేసే ప్రశాంత్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరిని విచారిస్తున్నారు. కాగా, ఆ ఏనుగుపై నిందితులు మండుతున్న టైరును విసిరేసిన ఘటనకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో నిందితులపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇలాంటి మనుషులను కఠినంగా శిక్షించాలని, మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూండా చూడాలని అంటున్నారు.

English summary
Awild elephant, which strayed into a human habitat in Tamil Nadu, was killed by an act of human cruelty as a burning tyre was hurled at it by the staff of a private resort in Masinagudi in Nilgiris district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X