• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Wife argument: ఇంట్లో భార్యను గొడ్డలితో నరికి రోడ్డు మీద లాక్కొని వెళ్లిన భర్త, ఏం జరిగిందంటే !

|

జైపూర్/చెన్నై/హైదరాబాద్: వివాహం జరిగిన తరువాత దంపతులు కొన్ని సంవత్సరాలు హ్యాపీగా సంసారం చేశారు. వివాహం జరిగిన ఆరు సంవత్సరాలకు ఒక బిడ్డ పుట్టాడు. 14 ఏళ్ల తరువాత మరో బిడ్డ పుట్టడంతో అక్కడ భర్తకు అనుమానం పెరిగిపోయింది. ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత దంపతుల మధ్య గొడవలు తారాస్థాయికి చేరిపోయాయి. పెద్దలు పంచాయితీలు చేసినా భర్త మాత్రం ఏమాత్రం తగ్గకుండా భార్యను చితకబాదుతున్నాడు. బయటకు వెళ్లిన భర్త నేరుగా ఇంటికి వెళ్లాడు. ఇంట్లో ఉన్న భార్య బయటకు లాగి పదునైన గొడ్డలి తీసుకుని ఇష్టం వచ్చినట్లు నరికేశాడు. భార్యతో పాటు అతని 9 నెలల చిన్నారిని గొడ్డలితో నరికేశాడు. భార్యను నరికిన తరువాత ఆమె శవాన్ని ఇంటి నుంచి సుమారు 80 మీటర్ల వరకు నడిరోడ్డు మీద లాక్కొని వెళ్లి రోడ్డు పక్కన విసిరేయడం కలకలం రేపింది.

Company MD: లేడీ సెక్రటరీకి క్యాబిన్ లో బెడ్ రూమ్, సీక్రెట్ కెమెరాలతో సినిమా, స్టాఫ్ స్కెచ్, అపర్ణ !Company MD: లేడీ సెక్రటరీకి క్యాబిన్ లో బెడ్ రూమ్, సీక్రెట్ కెమెరాలతో సినిమా, స్టాఫ్ స్కెచ్, అపర్ణ !

లేటుగా పుట్టిన బిడ్డ

లేటుగా పుట్టిన బిడ్డ

రాజస్థాన్ లోని కోటా జిల్లా భాటపాడా ప్రాంతంలో సునీల్ వాల్మీకి అలియాస్ పింటు (40) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 15 సంవత్సరాల క్రితం సీమా (35) అనే యువతిని సునీల్ వివాహం చేసుకున్నాడు. వివాహం అయిన ఆరు సంవత్సరాల తరువాత సునీల్, సీమా దంపతులకు ఓ కుమారుడు పుట్టాడు.

 9 నెలల క్రితం తేడా వచ్చింది

9 నెలల క్రితం తేడా వచ్చింది

కొడుకు పుట్టిన ఆరు ఐదు సంవత్సరాల వరకు సునీల్, సీమా దంపతులకు మళ్లీ పిల్లలు పుట్టలేదు. కొడుకు పుట్టిన తరువాత సునీల్ ప్రవర్తనలో మార్పు వచ్చింది. భార్య సీమాతో సునీల్ గొడవపడేవాడు. అయితే 9 నెలల క్రితం సీమాకు మరో కొడుకు పుట్టాడు. అప్పటి నుంచి భార్య సీమా మీద సునీల్ కు అనుమానం పెరిగిపోయింది. నిత్యం భార్య సీమాతో ఆమె భర్త సునీల్ గొడవలు పడుతూనే ఉన్నాడు.

 పంచాయితీలు చేసినా ఫలితం లేదు

పంచాయితీలు చేసినా ఫలితం లేదు

ప్రతినిత్యం భార్య సీమాతో గొడవ పడుతున్న సునీల్ కు ఊరి పెద్దలు, బంధువులు, కుటుంబ సభ్యులు నచ్చచెబుతూనే ఉన్నారు. నా భార్య గురించి నాకు తెలుసు, మీ పంచాయితీలు, మీరు చెప్పే నీతులు ఇక చాలు అంటూ సునీల్ వారి మీద మండిపడేవాడు. ఎవరు ఎంత చెప్పినా సునీల్ లో మాత్రం మార్పురాలేదు. భార్య సీమాతో మాత్రం గొడవలు పడుతూనే ఉన్నాడు.

 భార్యను గొడ్డలితో అడ్డంగా నరికేసిన భర్త

భార్యను గొడ్డలితో అడ్డంగా నరికేసిన భర్త

ఇంటి నుంచి బయటకు వెళ్లిన సునీల్ కొన్ని గంటల తరువాత ఇంటికి వెళ్లాడు. ఇంటికి వెళ్లిన సునీల్ భార్య సీమాను ఎలా చూశాడో ? ఏమో తెలీదు కాని రగిలిపోయాడు. అంతే ఇంట్లో ఉన్న పదునైన గొడ్డలి తీసుకుని భార్య సీమాను ఇష్టం వచ్చినట్లు నరికేశాడు. సీమాతో పాటు 9 నెలల కుమారుడి మీద, 9 ఏళ్ల కుమారుడి మీద సునీల్ దాడి చేశాడు. భార్య సీమా తప్పించుకోవడానికి ప్రయత్నించినా ఆమెను వదలకుండా గొడ్డలితో నరికి అతి కిరాతకంగా చంపేశాడు.

 రోడ్డు మీద శవాన్ని లాక్కెళ్లిన భర్త

రోడ్డు మీద శవాన్ని లాక్కెళ్లిన భర్త

భార్య సీమాను దారుణంగా చంపేసిన సునీల్ ఆమె శవాన్ని ఇంటి నుంచి సుమారు 70 నుంచి 80 మీటర్ల వరకు రోడ్డు మీద లాక్కెళ్లి రోడ్డు పక్కన విసిరేశాడు. సునీల్ ఆవేశంతో భార్య సీమా శవాన్ని రోడ్డు మీద లాక్కొని వెలుతున్న సమయంలో స్థానికులు భయంతో పరుగు తీశారు. అప్పటికే ఊరి నుంచి వెళ్లిన సీమా సోదరుడికి విషయం తెలిసి అక్కడికి పరుగు తీశాడు.

 పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన భర్త

పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన భర్త

భార్య సీమాను దారుణంగా హత్య చేసిన సునీల్ గొడ్డలి తీసుకుని వెళ్లి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. సీమా 9 నెలల కుమారుడిని ఆసుపత్రికి తరలించగా చిన్నారని మరణించాడని టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రచురించింది. తండ్రి దాడిలో సీమా పెద్ద కుమారుడికి గాయాలైనాయి. దంపతుల మద్య నిత్యం గొడవలు జరుగుతున్నాయని, అందు వలనే సీమాను, కొడుకును సునీల్ హత్య చేశాడని కేసు విచారణలో ఉందని కోటా ఎస్పీ వికాస్ పాఠక్ చెప్పారని స్థానిక మీడియా తెలిసింది.

English summary
Horror: In a horrifying incident, a 40-year-old man in Rajasthan’s Kota district allegedly brutally murdered his 35-year-old wife by attacking her with an axe. He later dragged her body for around 70 to 80 metres on the road, sparking panic in the area. The couple’s infant son also sustained injuries in the appalling attack and succumbed at a medical facility, where he was rushed for treatment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X