Horror: 30 ఏళ్ల యువతిని 30 ముక్కలు చేశారు, తల మాయం, ఏం జరిగిందో, ఏం చేసిందో ? కథ క్లోజ్!
మీరట్/ లక్నో/ బెంగళూరు: ఎక్కడో ఏదో తేడా జరిగింది. అంతే 30 ఏళ్ల మహిళతో ఊహించని విధంగా గొడవ జరిగింది. ఆ మహిళ ఏం పాపం చేసిందో ? ఏమో ?, ఆమెను చంపేసి తల, మొండెం వేరు చేశారు. 30 ఏళ్ల మహిళ శరీరాన్ని 30 ముక్కలు చేసి ప్లాస్టిక్ సంచిలో వేసి దానిని తీసుకెళ్లి డంప్ యార్డ్ లో విసిరేశారు. సంచిలో ఉన్న యువతి మాంసం ముక్కలను కుక్కలు బయటకు లాగి తినడంతో అక్కడ ఉన్న పిల్లలు కేకలు వేశారు. రంగంలోకి దిగిన పోలీసులకు మహిళ శరీరం ముక్కలు మాత్రమే చిక్కాయి. తల ఇంత వరకు పోలీసులకు చిక్కకపోవడంతో ఆ ప్రాంతంలో కలకలం రేపింది.
friend wife: బిగ్ షాట్ కోడలు, స్టార్ హోటల్స్ లో ప్రియుడితో జల్సాలు, రూ. 20 కోట్లు గోవిందా గోవింద !

ఆడుకుంటున్న పిల్లలు
ఉత్దర్ ప్రదేశ్ లో మీటర్ లోని ఫతేహుల్లాపూర్ ప్రాంతంలోని స్మశానవాటిక సమీపంలో కార్పోరేషన్ డంపింగ్ యార్డు ఉంది. కరోనా వైరస్ కారణంగా స్కూల్స్ మూసివేయడంతో స్థానికంగా నివాసం ఉంటున్న పిల్లలు ఇళ్ల దగ్గరే ఉంటూ ఆడుకుంటున్నారు. డంపింగ్ మార్డు సమీపంలో పిల్లలు ఆడుకుంటున్న సమయంలో వీధి కుక్కలు గుంపుగా అక్కడికి వెళ్లాయి.

మూటలో మాంసం ముక్కలు
డంపింగ్ యార్డులోని ప్లాస్టిక్ సంచిలోని మాంసం ముక్కలను బయటకు లాగిక కుక్కలు ఒక్కో ముక్కను ఒక్కొ కుక్క లాక్కెళ్లి తినడం ప్రారంభించడంతో అక్కడే ఆడుకుంటున్న పిల్లలు భయంతో గట్టిగా కేకలు వేశారు. పిల్లలు కేకలు వేస్తున్న విషయం వినపడి ఆ పిల్లల తల్లిదండ్రులు అక్కడికి పరుగు తీశారు. మూటలో నుంచి కుక్కలు మనిషి మాంసం ముక్కలు బయటకు లాగుతున్న విషయం గుర్తించిన స్థానికులు భయంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.

30 ఏళ్ల మహిళ శరీరం ముక్కలు
స్థానికులు సమాచారం ఇవ్వడంతో అక్కడికి లిసారీ గేట్ పోలీసులు పరుగు తీశారు. ప్లాస్టిక్ సంచిలోని మనిషి అవశేషాలు పరిశీలించిన పోలీసులు షాక్ కు గురైనారు. సుమారు 30 ఏళ్ల యువతి శరీరాన్ని 30 ముక్కలకు పైగా కత్తిరించి ఫతేహుల్లాపూర్ లోని ఓ స్మశానవాటిక సమీపంలోని డంపింగ్ యార్డులో విసిరేసి వెళ్లారని వెలుగు చూసింది.

తల నరికి ఎత్తుకెళ్లారు
స్మశానవాటిక సమీపంలోని డంపింగ్ మార్డులో కేవలం మహిళ శరీరం ముక్కలు మాత్రమే చిక్కాయని, ఆమె తల మాత్రం అక్కడ లేదని మీరట్ సిటీ అడిషనల్ పోలీసు కమిషనర్ అఖిలేష్ నారాయణ్ సింగ్ మీడియాకు చెప్పారు. అక్రమ సంబంధం, ఆర్థిక లావాదేవీల కారణంగానే మహిళ హత్యకు గురై ఉంటుందని మీరట్ అదనపు పోలీసు కమిషనర్ అఖిలేష్ నారాయణ్ సింగ్ అనుమానం వ్యక్తం చేశారు.

పక్కాప్లాన్ తో హత్య
30 ఏళ్ల యువతికి తెలిసిన వాళ్లే ఆమెను నమ్మించి తీసుకెళ్లి హత్య చేసి శరీరాన్ని ముక్కలు ముక్కలు చేశారని, ఆమె ఆనవాళ్లు గుర్తు పట్టకుండా ఆమె తల నరికి ఎత్తుకెళ్లి ఉంటారని మీరట్ అదనపు పోలీసు కమిషనర్ అఖిలేష్ నారాయణ్ సింగ్ అనుమానం వ్యక్తం చేశారు. స్మశానవాటిక, డంపింగ్ యార్డ్ సమీపంలో, పరిసర ప్రాంతాల్లోని వీధుల్లో ఏర్పాటు చేసిన అన్ని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నామని, నిందితులను త్వరలో పట్టుకుంటామని మీరట్ అదనపు పోలీసు కమిషనర్ అఖిలేష్ నారాయణ్ సింగ్ మీడియాకు చెప్పారు. ఒక యువతి తల నరికి ఆమె శరీరాన్ని చిన్నచిన్న ముక్కలుగా నరికివేసి ప్లాస్టిక్ సంచిలో తీసుకెళ్లి డంపింగ్ యార్డ్ లో విసిరివేయడంతో ఫతేహుల్లాపూర్ లో కలకలం రేపింది.