వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్ణాటకలో మరో ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామా, క్యూలో ఇద్దరు లేడీ ఎమ్మెల్యేలు, రెబల్స్ 16 మంది !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు షాక్ ఇచ్చారు. బెంగళూరు గ్రామీణ జిల్లా హోస్ కోటే ఎమ్మెల్యే, మంత్రి ఎంటీబీ. నాగరాజ్, చిక్కబళ్లాపుర శాసన సభ్యుడు డాక్టర్ కె. సుధాకర్ బుదవారం సాయంత్రం వారి పదవులకు రాజీనామా చేశారు. ఇప్పటికే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మాజీ మంత్రి రామలింగా రెడ్డి కుమార్తె, బెంగళూరులోని జయనగర ఎమ్మెల్యే సౌమ్యరెడ్డి, అంజలి నింబార్కర్ రాజీనామాలు చెయ్యడానికి సిద్దం అయ్యారు. ఇప్పటికే సౌమ్యరెడ్డి విధాన సౌధ చేరుకున్నారు.

బుదవారం సాయంత్రం విధాన సౌధలోని స్పీకర్ కార్యాలయానికి చేరుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంటీబీ నాగరాజ్, డాక్టర్ కె. సుధాకర్ వారి రాజీనామా పత్రాలను స్పీకర్ కార్యాలయంలో అందించారు. అంతకు ముందు రాజీనామా చెయ్యడానికి వచ్చిన డాక్టర్ కె. సుధాకర్ ను మంత్రి ప్రియాంక్ ఖర్గే స్పీకర్ కార్యాలయం సమీపంలో అడ్డుకున్నారు.

Hosakote MLA MTB Nagaraj and Chikkaballapur MLA Dr. Sudhakar has been resigned to their MLA post.

ఎమ్మెల్యే సుధాకర్ ను మంత్రి ప్రియాంక్ ఖార్గే అడ్డుకోవడంతో అక్కడ వాగ్వివాదం జరిగింది, తోపులాట మద్యలోనే స్పీకర్ కార్యాలయం పక్కనే ఉన్న మంత్రి కెజే. జార్జ్ కార్యాలయంలోకి ఎమ్మెల్యే సుధాకర్ ను పిలుచుకుని వెళ్లి రాజీనామా చెయ్యకూడదని నచ్చచెప్పడానికి విఫలయత్నం చేశారు.

అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ వారి మాటలు పట్టించుకోకుండా నేరుగా స్పీకర్ కార్యాలయం చేరుకుని రాజీనామ పత్రం అందించారు. అనంతరం విధాన సౌధ నుంచి బయటకు వచ్చిన మంత్రి ఎంటీబీ నాగరాజ్ నేరుగా సమీపంలోని రాజ్ భవన్ చేరుకున్నారు. మొత్తం మీద మరో ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామాలతో రెబల్ ఎమ్మెల్యేల సంఖ్య 16కు చేరుకుంది.
మరో ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చెయ్యడానికి సిద్దం కావడంతో సీఎం కుమారస్వామి ప్రభుత్వం దిక్కుతోచని పరస్థితో ఉంది.

English summary
Political crisis in Karnataka: Some reports say, Hosakote MLA MTB Nagaraj and Chikkaballapur MLA Dr. Sudhakar has been resigned to their MLA post.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X