వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

4ఏళ్లకు దారుణ ఆరోపణలా: పెషావర్ ఘాతుకంపై పాక్‌ను ఏకిపారేసిన ఈనమ్ గంభీర్

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్ : ఐక్యరాజ్య సమితి వేదికగా భారత్ పాకిస్తాన్‌ను ఏకిపారేసింది. 2014లో పాకిస్తాన్‌లోని పెషావర్‌లో ఉగ్రవాదులు ఓ స్కూల్లోకి జొరబడి 150 మందికి పైగా చిన్నారులను బలిగొన్న విషయం తెలిసిందే. ఈ దాడి భారత్ మద్దతుతో జరిగిందని పాక్ విదేశాంగ మంత్రి షా ఖురేషీ ఐక్యరాజ్య సమితిలో ఆరోపించారు.

<strong>వారి వల్లే: ఐక్యరాజ్య సమితి వేదికగా పాకిస్తాన్ దుమ్ముదులిపిన సుష్మాస్వరాజ్</strong>వారి వల్లే: ఐక్యరాజ్య సమితి వేదికగా పాకిస్తాన్ దుమ్ముదులిపిన సుష్మాస్వరాజ్

ఐక్యరాజ్య సమితిలో భారత్ మిషన్‌కు తొలి కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ఈనమ్ గంభీర్ ఈ వ్యాఖ్యలను ధీటుగా తిప్పికొట్టారు. జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడిన పాకిస్తాన్ మంత్రి భారత దేశంపై అర్థం లేని, నిరాధార ఆరోపణలు చేశారని అభ్యంతరం వ్యక్తం చేశారు. నాలుగేళ్ల క్రితం పెషావర్‌లో చోటుచేసుకున్న భయానక ఉగ్రదాడికి సంబంధించి పాకిస్తాన్ అర్థరహితమైన ఆరోపణలు చేస్తోందన్నారు.

Host And Patron Of UN Designated Terrorists, India Rips Into Pak At UN

ఆ ఘటన జరిగిన వెంటనే భారత్‌ బాధాతప్త హృదయంతో సానుభూతిని తెలియజేసిందని గుర్తు చేశారు. భారత పార్లమెంట్‌ కూడా ఈ దాడిని ఖండించిందని, ఈ ఘటనలో అమాయకులైన చిన్నారులు మృతి చెందడంపై భారత్‌వ్యాప్తంగా స్కూళ్లలో విద్యార్థులు 2 నిమిషాలపాటు మౌనం పాటించారని, భారత్‌పై పాక్‌ విదేశాంగ శాఖ మంత్రి చేసిన ఆరోపణలతో ఆనాటి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన అమాయకులైన చిన్నారుల స్మృతిని అగౌరవపరిచారని దుయ్యబట్టారు.

పొరుగు దేశంలో అస్థిరతను సృష్టించడం కోసం పెంచి పోషించిన ఉగ్రవాదం నుంచి పాకిస్తాన్ తప్పించుకునేందుకు ఇలాంటి నిరాశపూరిత ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు. కొత్త పాక్ ప్రభుత్వం కూడా పాత పాటనే పాడుతోందని అభిప్రాయపడ్డారు. ఐక్యరాజ్య సమితి గుర్తించిన తీవ్రవాదులను తాము పెంచి పోషించడం లేదని పాకిస్తాన్ చెప్పగలదా అని ఈనమ్ గంభీర్ నిలదీశారు.

పాకిస్తాన్ స్పాన్సర్డ్ తీవ్రవాదులు భారత్ సైన్యాన్ని చంపుతున్నారని ఆమె వాపోయారు. తమ ప్రతి జవాన్ మృతికి లెక్క ఉంటుందని ఆమె ధీటుగా సమాధానం చెప్పారు. తీవ్రవాదం, ఓ వైపు తమ సైన్యాన్ని చంపుతుంటే, చర్చలు జరిగే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు.

English summary
Taking a strong stand at the United Nations General Assembly, India on Saturday called out Pakistan after the country's Foreign Minister Shah Mehmood Qureshi alleged that New Delhi was involved in the Peshawar school terror attack in 2014. While rejecting Mr Qureshi's statement, Eenam Gambhir, India's First Secretary in Permanent Mission of India to UN, said it was the "most outrageous and preposterous allegation."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X