వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈ ఏడాది రోళ్ళు పగిలే ఎండలు .. ఐఎండీ నివేదిక ఇప్పుడే చెమటలు పట్టిస్తుందిగా !!

|
Google Oneindia TeluguNews

ఈసారి వేసవికాలంలో ఎండలు దంచికొట్టనున్నాయి . ఈ సమ్మర్ చాలా హాట్ గా ఉంటుందని భారత వాతావరణ శాఖ ఇప్పటికే వెల్లడించింది. మార్చి, మే వరకు వేసవి ఎలా ఉంటుందో అంచనా వేసిన, భారత వాతావరణ శాఖ (ఐఎమ్‌డి) ఉత్తర, ఈశాన్య, తూర్పు, పశ్చిమ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపింది.

అయితే, దక్షిణ మరియు మధ్య భారతదేశంలో సాధారణ ఉష్ణోగ్రత కంటే తక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

 మార్చి , మే నెలల మధ్య ఎండలు మండిపోతాయన్న అంచనా వేసిన ఐఎండీ

మార్చి , మే నెలల మధ్య ఎండలు మండిపోతాయన్న అంచనా వేసిన ఐఎండీ

దేశంలోని వివిధ ప్రాంతాలలో మార్చి , మే నెలల మధ్య ఎండలు మండిపోతాయి అన్న అంచనాను భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ సంవత్సరం మార్చి నెల రాకముందే వాతావరణం వేడిగా మారింది. గత నాలుగు రోజులుగా చూస్తే వాతావరణంలో అనేక మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. భానుడి భగభగ లతో పట్టపగలు ఇప్పటి నుండే చుక్కలు కనిపిస్తున్నాయి. ఇక ముందు ముందు ఎండాకాలం ఎలా ఉంటుందో అన్న ఆందోళన ఇప్పటి నుండే జనాలకు కలుగుతుంది.

ఉత్తర, వాయువ్య మరియు ఈశాన్య , మధ్య భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో ఈ సమ్మర్ లో మంటలే

ఉత్తర, వాయువ్య మరియు ఈశాన్య , మధ్య భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో ఈ సమ్మర్ లో మంటలే

రాబోయే వేసవి కాలంలో (మార్చి నుండి మే వరకు), సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉత్తర, వాయువ్య మరియు ఈశాన్య భారతదేశంలోని చాలా ప్రాంతాలు, మధ్య భారతదేశంలోని తూర్పు మరియు పశ్చిమ ప్రాంతాలలో ఎక్కువగా ఉంటాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. చత్తీస్ ఘడ్, ఒడిశా , గుజరాత్, మహారాష్ట్ర, గోవా ,తీరప్రాంత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో రాబోయే రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రత కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు కనిపించే అవకాశం ఉంది.

దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో ఉపశమనం

దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో ఉపశమనం

పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ తూర్పు యుపి, పశ్చిమ యుపి, చతిస్గడ్, జార్ఖండ్ నుండి ఒడిశా వరకు మార్చి నుంచి మే వరకు ఉష్ణోగ్రత 0.5 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉంటుందని ఐఎండి డైరెక్టర్ జనరల్ మృతుంజయ్ మహాపాత్రా తెలిపారు. అయితే, ఐఎమ్‌డి ప్రకారం దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో కొంతమేరకు ఉష్ణోగ్రతను తక్కువగా నమోదవడంతో, కొంత ఉపశమనం కలిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

 ఏప్రిల్ నుండి జూన్ వరకు రెండవ వేసవి అంచనాను ఏప్రిల్‌లో విడుదల చెయ్యనున్న ఐఎండీ

ఏప్రిల్ నుండి జూన్ వరకు రెండవ వేసవి అంచనాను ఏప్రిల్‌లో విడుదల చెయ్యనున్న ఐఎండీ

సాధారణ కాలానుగుణ గరిష్ట ఉష్ణోగ్రతలు దక్షిణ ద్వీపకల్పం అయిన ఇండియాలో మరియు ప్రక్కనే ఉన్న మధ్య భారతదేశం యొక్క చాలా ప్రాంతాలపై ఎక్కువగా ఉంటాయని వేసవికి సంబంధించిన ముందస్తు అంచనా తెలిపింది. ఇది ఈ సమ్మర్ చాలా హాట్ గా ఉండవచ్చు అని పేర్కొంది . ఏప్రిల్ నుండి జూన్ వరకు రెండవ వేసవి అంచనాను ఏప్రిల్‌లో ఐఎండీ విడుదల చేస్తుంది.

ఏది ఏమైనా ఈసారి రోళ్ళు పగిలే ఎండలు ఉండటం ఖాయమే అన్న అభిప్రాయం ఇప్పటినుండే వ్యక్తం అవుతుంది.

English summary
In its summer forecast for March to May, the India Meteorological Department (IMD) said on Monday that day temperatures are likely to be above normal in North, northeast, parts of East and West India. The weather department, however, added that there is a likelihood of below normal temperatures in South and central India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X