వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హోటల్ భవనం కూలి పదిమంది మృతి,రూ. 2 లక్షల పరిహరం

By Narsimha
|
Google Oneindia TeluguNews

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లో హోటల్ భవనం కూలిన ఘటనలో పది మంది మృతి చెందారు.శిథిలాల కింద ఉన్నవారిని రక్షించారు. ఈ ఘటనలో మరణించిన వారికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం రూ. లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించింది.క్షతగాత్రులకు రూ.50 వేలను ఇస్తామని ఆ రాష్ట్ర సీఎం శివరాజ్‌సింగ్ చౌహన్ ప్రకటించారు.

Hotel building collapses trapping people in Indore

శనివారం అర్ధరాత్రి పూట వేగంగా ప్రయాణిస్తున్న ఓ కారు ఇండోర్‌లోని సర్వేట బస్టాండ్ సమీపంలో ఉన్న హోటల్ భవనాన్ని ఢీకొంది. దీంతో ఈ భవనం కుప్పకూలిందని అధికారులు చెబుతున్నారు.అయితే ఈ భవనం కూలిపోవడానికి గల కారణాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

ఈ హోటల్‌లో సుమారు 25 గదులున్నాయి. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు ఇద్దరు మహిళలు సహ మొత్తం పది మంది మరణించారని అధికారులు ప్రకటించారు. శిథిలాల కింద సుమారు 50 మంది వరకు ఉంటారని అదికారులు అభిప్రాయపడుతున్నారు.

విషయం తెలిసిన వెంటనే అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని సహయక చర్యలను చేపట్టారు.మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో మరణించిన వారికి ఆ రాష్ట్ర ప్రభుత్వం రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించింది. క్షతగాత్రులకు రూ.50 వేలను పరిహరం ఇవ్వనున్నట్టు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహన్ ప్రకటించారు. సంఘటనా స్థలంలో సహయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకొన్న వారిని రెస్కూటీమ్ కాపాడింది.

English summary
Over two-dozen people were feared trapped in the debris of a 4-storey hotel building that collapsed late night near Sarwate Bus Stand in Indore on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X