వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హక్కుల నేతల గృహనిర్భంధం సెప్టెంబర్ 12 వరకు పొడగించిన సుప్రీంకోర్టు

|
Google Oneindia TeluguNews

మావోయిస్టులతో సంబంధాలు నెరుపుతున్నారన్న అనుమానంతో ఐదుమంది హక్కులనేతల గృహనిర్భంధాన్ని సెప్టెంబర్ 12 వరకు పొడగించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. హక్కుల నేతల అరెస్టుకు సంబంధించి కోర్టులో ఇంకా వాదనలు జరుగుతున్నందున మహారాష్ట్ర పోలీసులు జాగ్రత్తగా వ్యవహరించేలా సూచించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

భారీ భద్రత నడుమ హైదరాబాద్‌కు వరవరరావుభారీ భద్రత నడుమ హైదరాబాద్‌కు వరవరరావు

గతనెలలో దేశవ్యాప్తంగా హక్కుల నేతల ఇళ్లలో సోదాలు నిర్వహించిన పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. ఇందులో లాయర్ ట్రేడ్ యూనియన్ యాక్టివిస్టు సుధా భరద్వాజ్, విరసం నేత వరవరరావు, పౌరహక్కుల కార్యకర్త జర్నలిస్టు గౌతమ్ నవ్‌లఖా, అరుణ్ ఫెరీరా వెర్నాన్ గొన్సాల్వేస్‌లను పోలీసులు అరెస్టు చేశారు. వీరిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. వివిధ వర్గాల మధ్య రెచ్చగొట్టే ప్రసంగాలతో హింస రాజేసేందుకు చూశారని పోలీసులు ఆరోపించారు.

House arrests of activists extended by supreme court

భీమా కోరెగావ్‌లో చోటుచేసుకున్న హింసకు కారణం వీరి ప్రసంగాలేనంటూ పోలీసుల విచారణలో వెల్లడి కావడంతో వీరిని అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారంత పెద్ద ఎత్తున హింసను సృష్టించేందుకు ప్రణాళిక రచించారని పోలీసులు ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపితే అరెస్టులు చేస్తారా అనేదానిపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీంలో వాదనలు జరిగాయి. ఆ సందర్భంగా నిరసనలు తెలిపినందుకు హక్కుల నేతలను అరెస్టు చేయలేదని... పెద్ద ఎత్తున హింస సృష్టించేందుకు వ్యూహ రచన చేసినందుకే అరెస్టులు చేసినట్లు సుప్రీం కోర్టుకు మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

English summary
The Supreme Court on Thursday extended the house arrest of five rights activists arrested over suspicion of links with Maoists till September 12.The top court also asked the Maharashtra government to direct its police to be more responsible when the matter is heard by it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X