వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎట్టకేలకు... ఎమ్మెల్యే వివాదానికి కేంద్రబిందువైన ఇంటిని కూల్చివేసిన అధికారులు

|
Google Oneindia TeluguNews

మధ్యప్రదేశ్‌లో బీజేపీ ఎమ్మెల్యే ఆకాశ్ విజయ వర్గీయ బ్యాట్‌తో అధికారిపై దాడి చేసేందుకు కారణమైన ఇంటిని ఎట్టకేలకు అధికారులు కూల్చివేశారు..కూల్చివేత సమయంలో భారి బందోబస్తు ఏర్పాటు చేశారు.కాగా ఇదే ఇంటిలో నివసిస్తున్న వారి కోసం ఎమ్మెల్యే ఆకాశ్ మున్సిపల్ అధికారిని బ్యాట్‌తో కొట్టి వివాదానికి కేంద్ర బిందువు అయ్యాడు. అనంతరం ఆయనపై కేసు నమోదు కావడంతో జైలు పాలయ్యాడు.

మధ్యప్రదేశ్‌లోని ఇళ్ల కూల్చివేతను ఇండోర్‌ మున్సిపల్ అధికారులు ప్రారంభించారు. దీంతో గత నెల 26న ఇండోర్ మున్సిపాల్ అధికారులు ఇళ్లును కూల్చుతుంటే...అడ్డుకున్న బీజేపీ ఎమ్మెల్యే ఆకాశ్ విజయ్ వర్గీయ హంగామా సృష్టించాడు. ఇండోర్ మున్సిపాలిటీ అధికారిపై తిట్లపురాణం ప్రారంభించాడు. ఆవేశంతో విచక్షణ కోల్పోయిన ఎమ్మెల్యే ప్రజలు ,అధికారులు చూస్తుండగానే.. క్రికెట్ బ్యాట్‌తో మున్సిపల్ అధికారిపై దాడి చేసి హిరోయిజం చూపించాడు. ఏం జరిగిందని అక్కడున్న మీడియా ప్రతినిధులు ఆకాశ్‌ను అడగ్గా .. అధికారులు అక్రమంగా ఓ భవనాన్ని కూల్చివేశారని పేర్కొన్నాడు. అయితే భవనంతో కొందరు నివసిస్తున్నారని ఎమ్మెల్యే వాదిస్తున్నారు. ఇదే విషయం అడిగేందుకు ఫోన్ చేస్తే సదరు అధికారి తన కాల్ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ఓటువేసిన ప్రజలకు ప్రతినిధినని .. వారికి సంబంధించి బాధ్యత తనపై ఉందని పేర్కొన్నారు.

House at centre of Akash Vijayvargiya controversy demolished

ఇక ఎమ్మెల్యే తీరుపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడ ఫైర్ అయ్యాడు. ఆకాశ్ వ్యవహరించిన తీరును తీవ్రంగా వ్యతిరేకించాడు. పార్టీ నుండి ఎమ్మెుల్యే వెళ్లిపోయినా పర్వాలేదు. ఆయన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో జరిగిన సంఘటనపై షోకాజ్ నోటీసులు సైతం పంపించారు.

English summary
Days after BJP MLA from Indore Akash Vijayvargiya thrashed a Municipal Corporation officer with a cricket bat, houses 52 and 53 on Nagar Nigam road in the city’s Ganji Compound, which have been at the epicentre of a national controversy, were demolished on Friday
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X