వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సెక్స్ వర్కర్లకు జీఎస్టీ దెబ్బ: కష్టమే, రెడ్ లైట్ ఏరియాల్లో ఆందోళన..

శుభ్రతలో భాగంగా.. సెక్స్ వర్కర్స్ న్యాప్కిన్స్‌ను తప్పనిసరిగా వాడాలని సూచించిన కేంద్రమే.. ఇప్పుడిలా పన్నుపోటు పొడవడంతో వారు విలవిల్లాడుతున్నారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ.. సెక్స్ వర్కర్లకు ఆర్థిక భారంగా మారనుంది. జీఎస్టీ ప్రభావంతో నాప్కిన్స్ రేట్లు పెరగడంతో.. సెక్స్ వర్కర్లలో ఇకనుంచి వాటి వాడకం తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. శుభ్రతలో భాగంగా.. సెక్స్ వర్కర్స్ న్యాప్కిన్స్‌ను తప్పనిసరిగా వాడాలని సూచించిన కేంద్రమే.. ఇప్పుడిలా పన్నుపోటు పొడవడంతో వారు విలవిల్లాడుతున్నారు.

ముఖ్యంగా ఆసియాలోనే అతిపెద్ద రెడ్ లైట్ ఏరియా అయిన కోల్‌కతాలోని సోనాగచిలో సెక్స్ వర్కర్స్ జీఎస్టీపై పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వారు తప్పుపడుతున్నారు. జీఎస్టీ శ్లాబుల్లో కండోమ్స్ ను మినహాయించడం మంచి నిర్ణయమే అయినప్పటికీ.. న్యాప్కిన్స్ పై 12శాతం పన్ను విధించడం తమకు ఆర్థిక భారమేనని 1,30,000 మంది సెక్స్ వర్కర్లతో కూడిన దర్బార్ మహిళా సమన్వయ కమిటీ(డీఎంఎస్ సీ) ఆవేదన వ్యక్తం చేసింది.

How 12% GST on sanitary napkins is threatening sex workers in Sonagachi

పరిశుభ్రత క్యాంపెయిన్ తో.. తమలో న్యాప్కిన్స్ వాడేవారి సంఖ్య 20శాతం నుంచి 85శాతానికి పెరిగిందని, ఇప్పుడీ జీఎస్టీ దెబ్బకు సీన్ మళ్లీ రివర్స్ అవుతుందని ఆందోళన చెందుతున్నారు. డీఎంఎస్‌సీ ప్రతినిధి సమర్జిత్ ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. న్యాప్కిన్స్ పై జీఎస్టీ పన్ను సెక్స్ వర్కర్స్ ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుందన్నారు.

English summary
The 12 per cent GST on sanitary napkins imposed under the new tax regime has put sex workers of Sonagachi,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X