వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గోరఖ్‌పూర్‌లో బిజెపికి 29 దెబ్బ: విక్టరీని ఊహించని సమాజ్‌వాదీ పార్టీ

By Narsimha
|
Google Oneindia TeluguNews

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్‌పూర్ పార్లమెంట్‌ స్థానంలో బిజెపి అనుహ్యంగా ఓటమి పాలైంది ఈ స్థానం నుండి ఎస్పీ అభ్యర్ధి ప్రవీణ్‌కుమార్ విజయం సాధించారు. అయితే 29 ఏళ్ళ ప్రవీణ్‌‌కుమార్ గురించే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీంతో గోరఖ్‌పూర్‌లో 29 అనే సంఖ్య గురించే చర్చ సాగుతోంది.

గోరఖ్‌పూర్ పార్లమెంట్ స్థానంలో బిజెపి విజయాన్ని 29 ఏళ్ళ ప్రవీణ్‌కుమార్ నిషాద్ బ్రేక్ వేశాడు. కొత్త అభ్యర్ధి. ఎవరికీ అంతగా పరిచయం కూడ లేని వ్యక్తి ఈ ఎన్నికల్లో విజయం సాధించడం బిజెపికి ఊహించని దెబ్బే.

ఏపీ ఎఫెక్ట్: 'యూపీలో బిజెపికి తెలుగోడి దెబ్బ', 'రాజకీయాల్లో వేగంగా మార్పులు'ఏపీ ఎఫెక్ట్: 'యూపీలో బిజెపికి తెలుగోడి దెబ్బ', 'రాజకీయాల్లో వేగంగా మార్పులు'

1998 నుండి ఈ పార్లమెంట్ స్థానం నుండి బిజెపి ప్రాతినిథ్యం వహిస్తోంది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ స్థానం నుండి 1998 నుండి బిజెపి ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్నాడు అయితే యూపీ సీఎంగా యోగి బాధ్యతలు స్వీకరించడంతో ఎంపీ పదవికి యోగి రాజీనామా చేశారు. దీంతో ఈ స్థానానికి ఎన్నికలు జరిగాయి.

బిజెపిని దెబ్బ కొట్టిన 29 సంఖ్య

బిజెపిని దెబ్బ కొట్టిన 29 సంఖ్య

గోరఖ్‌పూర్ పార్లమెంట్ స్థానంలో బిజెపిని 29 అనే సంఖ్య దెబ్బతీసింది. ఈ స్థానం నుండి 29 ఏళ్ళుగా బిజెపి ప్రాతినిథ్యం వహిస్తోంది అయితే ఈ విజయాన్ని 29 ఏళ్ళ ప్రవీణ్‌కుమార్ నౌషద్ బ్రేక్ వేశాడు. బిజెపిని దెబ్బతీసేందుకు ఇదే 29 సంఖ్య కీలకంగా మారింది దీంతో స్థానిక ప్రజలు 29 గురించి చర్చించుకొంటున్నారు. యాధృచ్చికంగానే జరిగినా ఈ ఘటన ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

గోరఖ్‌నాథ్ మఠం పూజారులే విజేతలు

గోరఖ్‌నాథ్ మఠం పూజారులే విజేతలు

గోరఖ్‌నాథ్ పార్లమెంట్ స్థానానికి గోరఖ్‌నాథ్ మఠానికి చెందిన పూజారులు విజయం సాధిస్తున్నారు. కానీ దానికి భిన్నంగా సమాజ్‌వాద్ పార్టీ ప్రవీణ్‌కుమార్ నౌషద్‌ను రంగంలోకి దించింది. లక్నోలోని గౌతం బుద్ద యూనివర్సిటలో ఇంజినీరింగ్‌లో డిగ్రీ చేశాడు. 2011లో గ్రాడ్యుయేట్‌ పూర్తి చేశాడు. అతడిపై ఒక్క క్రిమినల్‌ కేసు కూడా లేదు. దీనికి తోడు ఎస్పీ, బిఎస్పీ పొత్తు కూడ బిజెపికి నష్టం చేకూర్చింది.

ఎస్సీని ఆశ్చర్యంలో ముంచిన విజయం

ఎస్సీని ఆశ్చర్యంలో ముంచిన విజయం

ప్రవీణ్‌కుమార్ నౌషద్ గురించి బిజెపి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదనే అభిప్రాయంతో ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బిజెపికి గట్టి పట్టున్న ఈ స్థానంలో 29 ఏళ్ళ ప్రవీణ్‌కుమార్ నౌషద్ లెక్కలోకి తీసుకోలేదు. అయితే అనుహ్యంగా ఎస్పీ,బిఎస్పీ పొత్తు ఈ స్థానంలో ప్రవీణ్ కుమార్ నౌషద్ గెలుపుకు కారణమయ్యాయి. ప్రవీణ్ కుమార్ నౌషద్ విజయం ఎస్పీ శ్రేణులను కూడ ఆశ్చర్యంలో ముంచెత్తింది.

బిజెపి విజయానికి బ్రేక్ వేసిన ప్రవీణ్

బిజెపి విజయానికి బ్రేక్ వేసిన ప్రవీణ్

బిజెపి విజయానికి గోరఖ్‌పూర్‌లో ఎస్పీ అభ్యర్ధి ప్రవీణ్‌కుమార్ నౌషద్ బ్రేక్ వేశారు. యూపీ రాజకీయాల్లో ఎక్కువగా నేర చరిత్ర ఉన్నవారే పోటీలో ఉంటారు. కానీ, దానికి భిన్నంగా ప్రవీణ్‌పై ఒక్క కేసు కూడ లేకపోవడం గమనార్హం, అంతేకాదు కొత్తవాడు. యువకుడు. బిజెపి అతి విశ్వాసం కూడ ఎస్పీ విజయానికి కారణంగా మారింది. ప్రవీణ్ కుమార్‌కు రూ.11లక్షల ఆస్తులున్నాయి. అందులోను రూ.99,000 లోన్‌ కూడా ఉంది. అతడి భార్య ఓ ప్రభుత్వ ఉద్యోగి. ఇద్దరు పిల్లలు ఉన్నారు.

English summary
The number '29' seems to have been very significant yesterday in UP's Gorakhpur, home to the famed Goraknath 'math', the religious centre of the 'Naths'.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X