వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అస్సాంలో వరద బాధల ఉపశమనం కోసం ఎయిర్‌టెల్ ఎలా సాయపడుతుంది

|
Google Oneindia TeluguNews

భీకర వర్షాల కారణంగా అస్సాం ప్రస్తుతం వరద విధ్వంసం ప్రభావంతో వణికిపోతోంది. పలు జిల్లాలు ఇప్పటికీ మునిగిపోయి ఉన్నాయి, అనేక కుటుంబాలు దెబ్బతినిపోతున్నాయి. అస్సాంలో ప్రముఖ మొబైల్ ఆపరేటర్ అయిన ఎయిర్‌టెల్ మరియు దాని నెట్‌వర్క్ టీమ్‌లు ఈశాన్య రాష్ట్రంలో వరద సహాయక చర్యల్లో తోడ్పడటానికి రాత్రింబవళ్లు పనిచేస్తూ వస్తున్నాయి.

అస్సాంలో ప్రస్తుత పరిస్థితి

అస్సాంలో ప్రస్తుత పరిస్థితి

వరదనీటి మట్టాలు ఇప్పటికే తగ్గుముఖం పట్టడం ప్రారంభించాయి, 12 జిల్లాల్లోని 268 గ్రామాలకు చెందిన 1,65,763 ప్రజలు ఇప్పటికీ వరద ప్రభావానికి గురవుతున్నారని అస్సాం రాష్ట్ర విపత్తు నిర్వహణ అధికారులు సూచించారు. వరద తాకిడికి గురైనవారి గురించి ఇప్పటికీ వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం మృతుల సంఖ్య 91కి చేరుకుంది.
ప్రస్తుతం, 615 సహాయ శిబిరాల్లో 99,000 మంది ఆశ్రయం పొందుతున్నారు. ఈ శిబిరాలు 12 జిల్లాల్లో నిర్వహించబడుతున్నాయని ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (PTI) నివేదించింది. అయిదు జిల్లాలలో 49 పునరావాస పంపిణీ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. పలు రంగాలకు చెందిన సెలబ్రిటీలు, కార్పొరేట్ సంస్థలు తమ సహాయాన్ని విస్తరిస్తూ కార్యాచరణలోకి దిగాయి.

కనెక్టివిటీకి హామీ

కనెక్టివిటీకి హామీ


వరదలకు అతి తీవ్రంగా ప్రభావితం అయినందున, రాష్ట్రంలోని పలు కుటుంబాలు తమ ఇళ్లనుంచి వెళ్లిపోయారు. నిరాశ్రయులైన వారిలో చాలామంది తమ ప్రియమైన వారితో సంబంధాలు కొనసాగించలేకపోతున్నారు. ఇలాంటివాళ్లకు సహాయహస్తం అందించి కమ్యూనికేషన్ చిక్కులను తగ్గించేందుకు, వరద ప్రభావిత ప్రాంతాలన్నింటా నెట్‌వర్క్ కనెక్టివిటీకి ఎయిర్‌టెల్ హామీపడుతోంది. దీనికోసం ఇళ్లలో మీరు చిక్కుకుపోయి ఉన్నా సరే మీకు నెట్‌వర్క్ అందించగలిగే LTE-900 టెక్నాలజీ సహాయం తీసుకుంటోంది.
భారతదేశ అతిపెద్ద సమీకృత టెలికమ్యూనికేషన్స్ సర్వీస్ ప్రొవైడర్ అస్సాం రాష్ట్రంలోని 30 జిల్లాల్లోని తన కస్టమర్లకు ఉచిత కాలింగ్ మరియు డేటా ప్రయోజనాలను అందిస్తోంది. ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రీపెయిడ్ మరియు పోస్ట్-పెయిడ్ కస్టమర్లు దీనితో అదనపు ప్రయోజనాలు పొందగలరు.

కనెక్ట్ అయి ఉండటం

కనెక్ట్ అయి ఉండటం

కస్టమర్లు తమ స్నేహితులు, కుటుంబంతో కనెక్ట్ అయి ఉండేలా చేయడానికి, 100MB నుంచి 5GB మధ్యదాకా 3G/4G డేటాతో కూడిన టాక్ టైమ్‌ను ఉచితంగా అందిస్తున్నట్లు ఎయిర్‌టెల్ ప్రకటించింది. ఈ ప్రయోజనాలతో, ప్రీపెయిడ్ యూజర్లు రీచార్జ్ చేసుకోవడానికి ప్రయాసపడాల్సిన పనిలేదు. పోస్ట్-పెయిడ్ కస్టమర్లకు బిల్ చెల్లింపు తేదీలు పొడిగించబడ్డాయి కూడా.
‘అస్సాం యొక్క ప్రధాన మొబైల్ ఆపరేటర్‌గా మరియు బాధ్యతాయుతమైన కార్పొరేట్ సిటిజన్‌గా, ప్రభుత్వం మరియు, పాలనా యంత్రాంగం చేస్తున్న ప్రయత్నాలకు మద్దతునిచ్చేందుకు మరియు ప్రకృతి వైపరీత్యం సమయంలో పౌరులు కనెక్ట్ అయి ఉండేలా హామీ పడేందుకు మేము ఇలా చొరవ తీసుకున్నాము' అని భారతి ఎయిర్‌టెల్ నార్త్ ఈస్ట్ & అస్సాం చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO) సోవన్ ముఖర్జీ చెప్పారు.

ఎయిర్‌టెల్ –అవసరంలో ఆదుకునే నేస్తం

ఎయిర్‌టెల్ –అవసరంలో ఆదుకునే నేస్తం

జాతి ప్రకృతి వైపరీత్యాల బారిన పడినప్పుడల్లా ఎయిర్‌టెల్ తన సహాయహస్తాన్ని అందిస్తూ వచ్చింది. ఇటీవలి కాలంలో, ఒడిశాలో ఫని తుఫాను విధ్వంసం సృష్టించి ప్రాణాలను హరించి, ఆస్తికి నష్టం కలిగించినప్పుడు, పరిస్థితిని చక్కదిద్దేందుకు ఎయిర్‌టెల్ వరద ప్రభావిత ప్రాంతాల్లో వార్ రూమ్‌లను నెలకొల్పింది. దేశంలోకెల్లా ప్రముఖ టెలికాం ఆపరేటర్ అయిన ఎయిర్‌టెల్ అనేక విపత్కాలాల్లో తన సబ్‌స్క్రయిబర్లు తమ ప్రియతములతో కనెక్ట్ అయి ఉండేందుకు ఎల్లప్పుడు సహాయపడుతూ వచ్చింది మరియు వీలైనంత మేరకు సహాయం చేయడంలో తన సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తూ వచ్చింది.

English summary
Assam is currently reeling from the impact of devastating flood caused by relentless rains. With several districts still submerged, several families continue to be affected. As the leading mobile operator in Assam, Airtel and its network teams have been working overtime to contribute to flood relief efforts in the North-Eastern State. 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X