వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వర్లి ఎలా ఉంది !!! శివసేన అభ్యర్థి ఆదిత్య పేరుతో పోస్టర్లు..

|
Google Oneindia TeluguNews

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. తమకు మరోసారి అధికారం కట్టబెట్టాలని బీజేపీ-శివసేన, ఐదేళ్లలో వారేం చేయలేదని కాంగ్రెస్-ఎన్సీపీ విమర్శలు గుప్పిస్తున్నాయి. వర్లి నుంచి బరిలోకి దిగిన శివసేన యువకెరటం ఆదిత్య థాకరే ప్రజలను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త ప్రచారాస్త్రాలను వాడుతున్నారు.

తొలిసారిగా: థాక్రే కుటుంబం నుంచి ఎన్నికల బరిలో ఆదిత్య థాక్రే తొలిసారిగా: థాక్రే కుటుంబం నుంచి ఎన్నికల బరిలో ఆదిత్య థాక్రే

తొలిసారిగా..

తొలిసారిగా..

శివసేన పార్టీ చరిత్రలో తొలిసారి థాకరే వారసుడు బరిలోకి దిగుతున్నారు. శివసేన పార్టీని స్థాపించిన బాల్ థాకరే ఏ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేయలేదు. ఆయన కుమారుడు, ప్రస్తుత శివసేన చీఫ్ ఉద్దవ్ థాకరే కూడా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి దిగలేదు. కానీ ఆయన కుమారుడు ఆదిత్య థాకరే మాత్రం ప్రత్యక్ష రాజకీయాలంటే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందులో భాగంగా ఈసారి వర్లి నుంచి బరిలోకి దిగారు.

రంగం సిద్ధం..

రంగం సిద్ధం..

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగేందుకు ఆదిత్య ముందే రంగం సిద్ధం చేసుకున్నారు. గత లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత ‘జన్ ఆశీర్వాద్' పేరుతో యాత్ర చేపట్టారు. లోక్‌సభ ఎన్నికలకు తమకు మద్దతు తెలిపిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో శివసేనను ఆదరించాలని కోరారు. ఎన్నికలకు పోటీ చేసే ముందు తన ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. అనుకున్నట్టుగానే అసెంబ్లీ ఎన్నికల బరిలో ఆదిత్య నిలిచారు.

వర్లీ ఎందుకంటే..

వర్లీ ఎందుకంటే..

తాను పోటీచేసే స్థానాన్ని కూడా ఆదిత్య ఎంపిక చేసుకున్నారు. అన్నీ సామాజిక వర్గాలు ఉండే వర్లీ నుంచి బరిలోకి దిగాలని నిర్ణయం తీసుకున్నారు. ఓ వైపు బీజేపీతో సీట్ల ఒప్పందం కుదరకముందే శివసేన అభ్యర్థిగా ఆదిత్య పేరును పార్టీ విడుదల చేసింది. అప్పటికే ప్రజలతో మమేకమవుతున్న ఆదిత్య.. తన పేరును ప్రకటించడంతో ప్రచారబరిలో దూసుకెళ్తున్నారు. మూస పద్ధతిలో కాకుండా ప్రజలను ఆకట్టుకునేందుకు కొత్తగా ప్రయత్నిస్తున్నారు.

‘హౌ ఆర్ యూ వర్లీ' పేరుతో పోస్టర్లు

‘హౌ ఆర్ యూ వర్లీ' పేరుతో పోస్టర్లు

ఏ ఒక్కరినో కాకుండా ‘హౌ ఆర్ యూ వర్లీ' అని పోస్టర్లు వేయించారు. వర్లీ ఎలా ఉంది అనే పేరుతో ఉర్దూ, గుజరాతీ, తెలుగు, మరాఠీలో ప్లెక్సీలలో పలకించారు. దీనిని బట్టి చూస్తే ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆదిత్య కొత్తగా ట్రై చేస్తున్నారని అర్థమవుతుంది. వారి మనసులను గెలిచేందుకు తొలుత ప్లెక్సీల గుండా పయనిస్తున్నారని తెలుస్తోంది. వర్లీ నుంచి ఇదివరకు సుశీల్ షిండే ప్రాతినిధ్యం వహించారు. ఆయనకు మరో స్థానం లేదంటే, పార్టీలో కీలక పదవీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.

English summary
Shiv Sena came up with posters of , which read 'How are you Worli?' in different languages. Aaditya is contesting the Maharashtra Assembly elections from Worli constituency.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X