వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ ఓ మంచి భర్తే కాలేకపోయారు..ఇక తండ్రిగా ఎలా సాధ్యం?: అల్కా లాంబ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ మోడీని జాతిపితగా అభివర్ణిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై మనదేశంలో చెలరేగిన దుమారం చల్లారలేదు. పైగా మరింత రాజుకుంటోంది కూడా. భారతీయ జనతాపార్టీయేతర ప్రతిపక్ష పార్టీల నాయకులు ఏకం అయ్యారు. నరేంద్ర మోడీని జాతిపితగా కీర్తిస్తూ డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యాలపై మండి పడుతున్నారు. ఈ జాబితాలో తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే అల్కా లాంబ చేరిపోయారు. డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఆమె తనదైన శైలిలో ప్రతిస్పందించారు. నరేంద్ర మోడీకి కూడా చురకలు అంటించారు.

సీజన్ లో నాలుగోసారి: శ్రీశైలం రిజర్వాయర్ గేట్లు మళ్లీ ఎత్తివేత: కృష్ణాకు వరదపోటు!సీజన్ లో నాలుగోసారి: శ్రీశైలం రిజర్వాయర్ గేట్లు మళ్లీ ఎత్తివేత: కృష్ణాకు వరదపోటు!

నరేంద్ర మోడీ ఓ మంచి భర్తే కాలేకపోయారని, ఇక మంచి తండ్రిగా ఎలా సాధ్యపడుతుందని అల్కా లాంబ ప్రశ్నించారు. తండ్రి అనే పదం అత్యున్నతమైనదని, దాన్ని కించపరిచేలా డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారని అన్నారు. ఓ మంచి తండ్రిగా గుర్తింపు తెచ్చుకునే హక్కు నరేంద్ర మోడీకి లేదని అన్నారు. భారతీయులు ఎవరూ నరేంద్ర మోడీని జాతిపితగా అంగీకరించబోరని స్పష్టం చేశారు. నరేంద్ర మోడీని జాతిపితగా అభివర్ణిస్తూ డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యానాలను స్వాగతించని వాళ్లందరూ అసలు భారతీయులే కాదని అంటూ కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ చేసిన ప్రకటనపైనా ఆమె తీవ్రంగా స్పందించారు.

How can one be a father if he is not even a husband, asks Alka Lamba as Trump calls PM Modi ‘father of India

ఈ ఒక్క అంశాన్ని ప్రాతిపదికగా తీసుకుని భారతీయ పౌరసత్వాన్ని కేంద్ర ప్రభుత్వం తొలగించేలా ఉందని ఎద్దేవా చేశారు. భారత్ లో నివసించాలంటే నరేంద్ర మోడీకి జై కొట్టాల్సిన దుస్థితిని రావొచ్చని అన్నారు. ఈ అంశంపై మజ్లిస్ అధినేత, హైదరాబాద్ లోక్ సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ పై నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే. ట్రంప్ ను ఆయన నిరక్షరాస్యుడని అన్నారు. జాతిపిత అనే పదం చాలా పెద్దదని, జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ వంటి జాతీయ నాయకులకు సైతం ఆ పదాన్ని వినియోగించలేదని అన్నారు. వారితో పోల్చుకుంటే నరేంద్ర మోడీ చాలా చిన్న వ్యక్తి అని చెప్పారు.

English summary
Former Aam Aadmi Party (AAP) leader Alka Lamba, on Tuesday, joined the chorus criticising US President Donald Trump’s remark in which he called Prime Minister Narendra Modi “Father of India”. Ridiculing Trump’s remark, the former AAP MLA from Delhi’s Chandni Chowk said that how can one be a father if he is not even someone’s husband.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X