• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బీజేపీ ఎంపీ చేతిలో 10వేల రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లు -కోర్టు విస్మయం -మోదీ సర్కారుకు నోటీసులు -అరెస్టు తప్పదా?

|

కరోనా మహమ్మారి రెండో దశ విలయంలో కొత్త కేసులు, మరణాలు భారీగా నమోదవుతూ, ఆస్పత్రులన్నీ కిక్కిరిసి, అత్యవసర మందుల కొరత, ఆక్సిజన్ కొరత కొనసాగుతుండగా, అధికార బీజేపీకి చెందిన కొందరు నేతలు మాత్రం ఎంచక్కా దొడ్డిదారిలో మందులు దక్కించుకుని, తమ ప్రైవేటు ఆస్పత్రుల్లో విక్రయించుకోవడం వివాదాస్పదమైంది. మహారాష్ట్ర బీజేపీ ఎంపీ సుజయ్ విఖే పాటిల్ సూత్రధారిగా వెలుగుచూసిన అక్రమ వ్యవహారంపై బాంబే హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది.

పశువులా కట్టేశారు: సీజేఐ రమణ బెంచ్ కీలక ఉత్తర్వులు -సిద్ధిక్‌ కప్పన్‌ భార్య పిటిషన్‌పై విచారణ -ఉత్కంఠపశువులా కట్టేశారు: సీజేఐ రమణ బెంచ్ కీలక ఉత్తర్వులు -సిద్ధిక్‌ కప్పన్‌ భార్య పిటిషన్‌పై విచారణ -ఉత్కంఠ

దేశంలో కొవిడ్ ప్రోటోకాల్ అమలవుతూ, అత్యవసర మందుల్ని కేంద్ర ప్రభుత్వమే సేకరించి, రాష్ట్రాలకు పంపిణీ చేయాల్సి ఉండగా, ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ఇంత పెద్ద మొత్తంలో ఇంజెక్షన్లు ఎలా వెళుతున్నాయని హైకోర్టు ప్రశ్నించింది. దీనికి వెంటనే సమాధానం చెప్పాల్సిందిగా కేంద్రంలోని మోదీ సర్కారుకు నోటీసులు జారీ చేసింది.

How can private individuals buy Remdesivir, Bombay HC asks Centre amid bjp mp Sujay Patil row

అహ్మద్ నగర్ బీజేపీ ఎంపీ సుజయ్ పాటిల్ కొద్ది రోజుల కిందట ఢిల్లీ నుంచి ఓ ప్రైవేటు విమానంలో 10వేల డోసుల రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లను తెప్పించుకున్నారు. ఢిల్లీలో తనకున్న పలుకుబడిని ఉపయోగించి మందులు తెప్పించానన్న ఆయన వాటిలో కొన్నిటిని స్థానిక సాయిబాబా ఆస్పత్రికి, మరికొన్నిటిని ప్రభుత్వ ఆస్పత్రికి పంపిణీ చేసి, మిగతా డోసులను తన ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఎంపీ సుజయ్ మాదిరిగానే మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ కూడా వ్యక్తిగత హోదాలో అత్యవసర మందుల్ని తెప్పించుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వివాదంపై హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.

జగన్ బెయిల్ రద్దు: సీఎం, సీబీఐకి భారీ షాక్ -ఎంపీ రఘురామ పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు -నోటీసులుజగన్ బెయిల్ రద్దు: సీఎం, సీబీఐకి భారీ షాక్ -ఎంపీ రఘురామ పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు -నోటీసులు

అక్రమంగా మందులు తరలించిన ఎంపీని అరెస్టు చేయాలని, అత్యవసర మందుల పంపిణీ వ్యవస్థలో లోపాలను సరిదిద్దాలంటూ దాఖలైన పిటిషన్లపై బాంబే హైకోర్టు సీజే జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ గిరీశ్ కులకర్ణి నేతృత్వంలోని డివిజన్ బెంచ్ మంగళవారం విచారణ చేపట్టింది. ఒకరిద్దరు రాజకీయ నేతలతోపాటు కొద్ది మంది బడా బాబులు నేరుగా అత్యవసర మందులు పొందుతోన్నట్లు కోర్టు దృష్టికి వచ్చిందని, ఒకవేళ ఎవరికి పడితే వారికి మందులు ఇచ్చే వ్యవస్థ ఉన్నట్లయితే వెంటనే దాన్ని రద్దు చేసేందుకు వెనుకాడబోమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. రెమ్ డెసివిర్ ఇంజెక్షన్ల వ్యవహారంలో కేంద్రానికి నోటీసులిచ్చిన హైకోర్టు తదుపరి విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది. కరోనా నియంత్రణ చర్యలపై మహారాష్ట్ర సర్కారుకు కూడా నోటీసులు జారీ అయ్యాయి.

English summary
The Bombay High Court on Tuesday sought to know from the Centre as to how private individuals were procuring Covid-19 drugs such as Remdesivir directly from pharmaceutical companies, while the companies are required to provide its entire production to the Centre, which enables distribution to the states. The Court took note of the alleged distribution of over 10,000 vials of Remdesivir by Ahmednagar MP after buying it from Delhi and added that its Aurangabad Bench had already taken cognizance of the same on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X