వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రయాన్-2: జాబిల్లిపై విక్రమ్ ల్యాండర్ దిగేది ఇలా: వైరల్ గా మారిన ఇస్రో వీడియో

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: మనదేశ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న చంద్రయాన్-2 మిషన్ చివరి దశకు చేరుకుంది. మరి కొన్ని గంటల్లో విక్రమ్ ల్యాండర్.. జాబిల్లిని అందుకోబోతంది. దశాబ్దాల నాటి భారతీయుడి కలను సాకారం చేయబోతోంది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత 1:30 నుంచి 2:30 గంటల మధ్యలో విక్రమ్ ల్యాండర్ చందమామపై అడుగు పెట్టబోతోంది. దీన్ని ప్రత్యక్షంగా తిలకించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బెంగళూరులోని భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఇస్రో) ప్రధాన కార్యాలయానికి చేరుకోబోతున్నారు.

ఎన్నో ఆశలతో వచ్చాం..వ్యవస్థను మార్చలేం: సర్వీసుకు గుడ్ బై చెప్పిన ఐఎఎస్ టాపర్!ఎన్నో ఆశలతో వచ్చాం..వ్యవస్థను మార్చలేం: సర్వీసుకు గుడ్ బై చెప్పిన ఐఎఎస్ టాపర్!

పలువురు విద్యార్థులు కూడా మోడీతో కలిసి ఈ ల్యాండింగ్ ప్రక్రియను ప్రత్యక్షంగా వీక్షించే క్షణం కోసం ఎదురు చూస్తున్నారు. విక్రమ్ ల్యాండింగ్ ప్రస్తుతం ఇస్రో శాస్త్రవేత్తలకు సవాలుగా మారింది. ఎగుడు దిగుళ్లు, భారీ గోతులతో నిండిన జాబిల్లి దక్షిణ ధృవం వైపున విక్రమ్ ల్యాండ్ కానున్న విషయం తెలిసిందే. సాఫ్ట్ ల్యాండింగ్ కోసం శాస్త్రవేత్తలు అహర్నిశలు శ్రమిస్తున్నారు.

How Chandrayaan-2 will land on the Moon

కాగా.. విక్రమ్ ల్యాండింగ్ ఎలా ఉంటుందనే అంశంపై ఇప్పటికే కొందరు ఔత్సాహికులు కొన్ని వీడియోలు, చిత్రాలను రూపొందించారు. ఇస్రో శాస్త్రవేత్తలు సైతం తాజాగా ఓ వీడియోను రూపొందించి, తమ అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. ఈ వీడియో కాస్త వైరల్ గా మారిపోయింది. 3 నిమిషాల 44 సెకెన్ల నిడివి ఉన్న ఈ వీడియోకు విక్రమ్.. ద ల్యాండర్ అని నామకరణం చేశారు.

ఇందులో. ల్యాండింగ్ కు సంబంధించిన ప్రతి అంశాన్ని శాస్త్రవేత్తలు స్పృశించారు. ఈ ల్యాండర్ లో ఉన్న కీలక భాగాల గురించి వివరించారు. ఒక్కో భాగం పేరు.. దాని పనితీరును పొందుపరుస్తూ ఈ వీడియోను తయారు చేశారు శాస్త్రవేత్తలు. చంద్రుడి ఉపరితలానికి ఎన్ని కిలోమీటర్ల దూరంలో విక్రమ్ ల్యాండర్ పరిభ్రమిస్తోందనే విషయంతో పాటు.. మినిట్ టు మినిట్ దాని గమనాన్ని ఇందులో పొందుపరిచారు.

English summary
Sometime later, the Chandrayaan-2 lander will activate its lander position detection camera (LPDC) that will scan the lunar surface to find a suitable spot for the spacecraft to land. Once the landing site has been decided, the Vikram lander will perform a series of manoeuvres to gradually lower itself on to the lunar surface. The Vikram lander will perform another parabolic motion to bring itself 10 metres above the lunar surface, which is when the final descent will take place at an angle of exactly 90 degrees to the lunar surface.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X